/rtv/media/media_files/2025/06/25/shubhanshu-shukla-2025-06-25-08-03-59.jpg)
ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా పైలట్‌గా ఆక్సియం-4 మిషన్ ఈరోజు(బుధవారం) లాంచ్ అవ్వబోతుంది. జూన్ 25న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మరో ముగ్గురు హ్యోమగాములతో కలిసి ఆయన బయల్దేరనున్నారు. పలు కారణాలతో ఈ ప్రయాణం ఆరు సార్లు వాయిదా పడింది. ఈ ప్రయోగం ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి (భారతీయ కాలమానం ప్రకారం12:01 PM) అమెరికాలో అయితే తెల్లవారుజామున 2:31 గంటలకు ప్రారంభమవుతుంది.
With @Axiom_Space and @SpaceX, we're now targeting Wednesday, June 25, to launch #Ax4 to the @Space_Station.
— NASA (@NASA) June 24, 2025
The four-member crew, including astronauts from @ESA and @ISRO, is scheduled to lift off at 2:31am ET (0631 UTC). Learn more about the launch: https://t.co/P3QzvdE4vZ pic.twitter.com/AoWb5zTgXn
ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నడిచే కొత్త స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో ISSకి చేరుకుంటారు. ఇండియన్ టైం ప్రకారం.. జూన్ 26 గురువారం ఉదయం వారు ISS స్పేస్‌షిప్‌కు డాకింగ్ చేయనున్నారు. ఈ మిషన్‌కు నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ నాయకత్వం వహిస్తారు. ఆమెతో పాటు ఇస్రో వ్యోమగామి శుభాన్షు శుక్లా పైలట్‌గా ఉన్నాడు. వీరితోపాటు మరో ఇద్దరు పోలాండ్ నుండి ESA ప్రాజెక్ట్ ఆస్ట్రోనాట్ స్వావోస్జ్ ఉజ్నాన్స్కి-విస్నివ్స్కీ, హంగేరీ నుండి HUNOR ఆస్ట్రోనాట్ టిబోర్ కాపు లు ఆక్సియం 4 ప్రాజెక్ట్‌లో ఉన్నారు.