ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మళ్లీ ముదురుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌కు ఓ రష్యా ట్రక్కు ఆయుధాలు తరలిస్తోంది. దీంతో అప్రమత్తమైన ఉక్రెయిన్ ఆర్మీ ఆ ట్రక్కును పేల్చేసింది. ఆ ట్రక్కు నీటిపై ఉన్న వంతెనపై వస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంబంధించింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాసేపట్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా అధ్యక్షుడితో భేటీ కానున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. ట్రక్ పేల్చివేయడం వల్ల రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే దానిపై టెన్షన్ వాతారవణం నెలకొంది.
An epic explosion on the water crossing!
— Defense of Ukraine (@DefenceU) August 18, 2025
The occupiers tried to transport a gun on a truck across a river using a blown-up bridge, but failed. As a result, the truck with its crew and the gun were destroyed.
📹: 47th Mechanized Brigade pic.twitter.com/PLibr8A4IU
ఇదిలాఉండగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ అలస్కా వేదికగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం జరిగే అవకాశం ఉండొచ్చని చాలామంది భావించారు. కానీ ఈ చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. తాము పురోగతి సాధించనట్లు మాత్రం ట్రంప్, పుతిన్ చెప్పుకున్నారు. ఈ భేటీలో ఉక్రెయిన్.. దొనెట్‌స్క్ ప్రాంతం నుంచి వైదొలగాలని పుతిన్ ట్రంప్‌కు చెప్పారు. కానీ జెలెన్‌స్కీ మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. తమ ప్రాంతాన్ని అప్పగించేది లేదని స్పష్టం చేశారు.