విచిత్రం.. ఎడారిలో పోటెత్తిన వరదలు.. భవిష్యత్తులో జరిగే పరిణామాలు..

ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సహారా ఎడారి. అలాంటి ఎడారిలో ఇటీవల వరదలు సంభవించాయి. మొరక్కో దేశానికి సమీపంలో కురిసిన భారీ వర్షానికి ఆ ఎడారిలో వరదలు వచ్చాయి. 24 గంటల వ్యవధిలో 100 మిల్లీ మిటర్ల స్థాయి వర్షం కురిసింది. దీనిపై నిపుణులు హెచ్చరిస్తున్నారు.

floods in Sahara Desert
New Update

అది ఒక ఎడారి. ఎప్పుడు చూసినా మండే ఎండలు. కనుచూపు మేరలో పచ్చటి చెట్టు కానీ, చుక్క నీరు కానీ ఉండదు. ఎటు చూసినా ఇసుక. వర్షాకాలంలో సైతం ఎడారిలో ఎలాంటి నీరు ఉండదు. అందులోనూ సహారా ఎడారి అంటే అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి ఇది. దాదాపు 9 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లలో చదరంగా విస్తరించి ఉంది. మరి ఇంతటి అతి పెద్ద ఎడారిలో భారీ వర్షం, వరదలు వచ్చాయంటే నమ్ముతారా?.. ఆశ్చర్యంగా ఉంది కదూ.. మీరు విన్నది నిజమే. 

సహారా ఎడారిలో భారీగా వర్షం

ఇటీవల సహారా ఎడారి వరద నీటితో కలకల్లాడింది. మొరక్కో దేశానికి సమీపంలో రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షానికి ఆ ఎడారిలో వరదలు రావడం అందరినీ అయోమయానికి గురిచేసింది. మొరాక్కో రాజధాని రబాత్‌కు 450 కి.మీ దూరంలో ఉన్న టగౌనైట్ అనే గ్రామంలో సెప్టెంబర్ నెలలో కేవలం ఒక్క రోజు అంటే 24 గంటల వ్యవధిలో 100 మిల్లీ మిటర్ల స్థాయి వర్షం కురిసింది. దీంతో అక్కడి పల్లపు ప్రదేశాలలో వరద నీరు జోరుగా ప్రవహించింది. 

అందుకు సంబంధించిన ఫొటోలను అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ఇటీవల రిలీజ్ చేసింది. అందులో ఎండిపోయిన ఐరికీ చెరువు, టాటా, జగోరా వంటి జలాశయాలు అధిక మొత్తంలో నిండిపోయాయి. ఆపై లోతట్టు ప్రాంతాలకు నీరు ప్రవహించింది. అంతేకాకుండా భారీ వర్షం కారణంగా తాటి చెట్ల నీడలు నీటిలో స్పష్టంగా కనిపించాయి. 

ఇది కూడా చదవండి: మొగులయ్యకు అన్యాయం.. ప్రభుత్వం ఇచ్చిన 15 రోజులకే ధ్వంసం!

ఇలా ఒక ఎడారిలో భారీ వర్షం కురవడంపై వాతావరణ శాఖ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో వాతావరణంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. దీనిపై మొరాక్కో వాతావరణ ఏజెన్సీ అధికారి మాట్లాడారు. ఇలాంటి వర్షం ఎప్పుడో గత 50 సంవత్సరాల క్రితం కురిసిందని చెప్పారు.

అది కూడా చాలా తక్కువ స్థాయిలో పడిందని తెలిపారు. అయితే ఇలాంటి భారీ వర్షం సహారా ఎడారిలో కురిస్తే భవిష్యత్తులో ఊహించని సమస్యలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరించారు. దీని కారణంగా తుఫాన్లు వచ్చే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. 

#floods #latest-viral-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe