/rtv/media/media_files/2025/02/21/QYzh0oVZEskBJt2TtPjR.jpg)
Pygmy three-toed sloth viral video
సోషల్ మీడియాలో విచిత్రమైన వీడియోలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. వాటిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. ఏంటిది ఇలా ఉంది అంటూ అవాక్కవుతుంటారు. ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత చాలా మంది ప్రజలు అలాంటి వీడియోలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో ప్రపంచ నలు మూలల్లో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇట్టే కళ్ల ముందు కనిపించేస్తుంది.
అందులో ఎక్కువగా వింతలు, విచిత్రాలు, ఊహించని సంఘటనల వీడియోలే ఎక్కువ. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతోంది. ఆ వీడియో చూసి.. అందులో ఉన్నది ఏ జంతువు అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.
విచిత్ర జంతువు
మరికొందరు ఏంటా జీవి అలా ఉంది.. దాని పేరేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక వైరల్ అవుతోన్న ఆ వీడియో ప్రకారం.. రోడ్డు పక్కనే ఉన్న అడవిలో నుంచి ఓ జంతువు వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డు మీదకి వచ్చింది. దీంతో రెండు వైపుల వాహనాలు నిలిచిపోయాయి. అందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.
Aww it's a baby and they gave him to his mother. 🤗 And the baby gives Elon Musk salute.#Grok#ElonMusk#Trump#dhanashreeverma#ABPIdeasOfIndiapic.twitter.com/J1EwdLDL7h
— Suman Rastogi (@SumanRastogi6) February 21, 2025
కానీ ఒక్కరు కూడా ఆ జంతువును ముట్టుకునే ప్రయత్నం చేయలేదు. అంతలో ఓ వ్యక్తి ఆ జంతువు దగ్గరకి క్లాత్ పట్టుకొని వెళ్లాడు. వెంటనే ఆ జంతువు తన పొడవాటి గోళ్లు కలిగిన వేళ్లతో తోసేసింది. అతడు ఒక్కసారిగా భయపడ్డాడు. అనంతరం మరో వ్యక్తి వెళ్లి దాని రెండు చేతులు పట్టుకుని అడవిలోని ఒక చెట్టు దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడే ఆ జంతువు తల్లి కనిపించడంతో ఆ చెట్టుపై పెట్టేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
దాని పేరేంటి?
వీడియోలో ఉన్న ఈ జంతువు పేరు పిగ్మీ త్రీ-టోడ్ స్లాత్. దీనిని మాంక్ స్లాత్ లేదా డ్వార్ఫ్ స్లాత్ అని కూడా పిలుస్తారు. ఇది బ్రాడీపోడిడే కుటుంబంలోని బద్ధకం జంతువుగా పేరుగాంచింది. ఇది చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఈ జాతి పనామాలోని కరేబియన్ తీరంలో ఉన్న ఒక చిన్న ద్వీపం ఇస్లా ఎస్కుడో డి వెరాగ్వాస్‌లో ఉంటుంది.