USA: ఎలాన్ మస్క్ కు పిచ్చెక్కింది-ట్రంప్

 ఇద్దరూ మొన్నటి వరకు అత్యంత సన్నిహితులు. ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు. కానీ ఇప్పుడు బద్ధ శత్రువులు. నేను లేకపోతే ట్రంప్ లేరని మస్క్ అంటుంటే..అతనికి పిచ్చెక్కింది అని అమెరికా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

New Update
Trump and Elon Musk

Trump and Elon Musk

 ఇద్దరూ ఇద్దరే..మాటలు మార్చడంలో దిట్ట. అంతా బాగుంటే సరే లేకపోతే ఎంతటి మాటలు అనుకోడానికి అయినా...ఏం చేయడానికి అయినా వెనుకాడరు. వాళ్ళిద్దరే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెక్ అధిపతి ఎలాన్ మస్క్. ఇద్దరూ ఒకలాంటి మైండ్ సెట్ ఉన్నవారే. అందుకే ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు అదే కారణంతో బద్ధ శత్రువులుగా కూడా ప్రవర్తిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరు.. కేవలం శాశ్వత ప్రయోజనాలే ఉంటాయన్న దానికి ట్రంప్‌-మస్క్‌లు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు. వారం క్రితం వరకు కలిసి మెలిసి పని చేసి...అమెరికా గతిని మార్చడానికి పాటుపడిన వారు ఇప్పుడు తిట్టుకుంటున్నారు. 

మస్క్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

ఎలాన్ మస్క్ కు పిచ్చెక్కిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదని...అందుకే మస్క్ తో తాను ఇప్పుడు మాట్లాడ్డానికి సిద్ధంగా లేనని అన్నారు. రెండు రోజుల నుంచి ఇద్దరి మధ్యా సాగుతున్న వార్ మితి మీరుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. అమెరికా ఫస్ట్ అంటూ కలిసి పని చేశారు. అధ్యక్ష ఎన్నికల ముందు నుంచీ కలిసి ప్రణాళికలు వేశారు. కానీ ఇప్పుడు బద్ధ శ్రతువుగా వ్యవహరిస్తున్నారు.  ఇదంతా వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు(One Big Beautiful Bill) వలన వచ్చింది. ఈ బిల్లు విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెక్ అధిపతి ఎలాన్ మస్క్ మధ్య భేదాభిప్రయాలు వచ్చాయి. ఇద్దరూ బహిరంగంగానే విమర్శించుకుంటున్నారు.

 ట్రంప్ ను అధ్యక్ష ఎన్నికల్లో తానే గెలిపించానని...కానీ ఆయనకు కృతజ్ఞత లేదని ఎలన్‌ మస్క్ ఆరోపించారు. తాను లేకుంటే రిపబ్లికన్‌ పార్టీ ఓడిపోయేదని.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారని మస్క్ అన్నారు. దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కౌంటరిచ్చారు. ఎలాన్ మస్క్ లేకున్నా గెలిచేవాడినే అన్నారు. దాంతో పాటూ ఎలాన్ మస్క్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఎక్కువ చేస్తే మస్క్‌ కాంట్రాక్టులు, కంపెనీలపై ట్యాక్సులు పెంచుతాని ట్రంప్‌ హెచ్చరించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు