/rtv/media/media_files/2025/05/02/i0NOoEW9RuyJdJagjIkj.jpg)
pok alert
పహల్గామ్ దాడి తర్వాత భారత్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ అలెర్ట్ అయింది. నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న 13 నియోజకవర్గాల్లో రెండు నెలల పాటు ఆహార సామాగ్రిని నిల్వ చేసుకోవాలని PoKలోని పౌరులకు సూచనలు జారీ చేసినట్లు పాకిస్తాన్ పాలిత కశ్మీర్ ప్రధాన మంత్రి చౌదరి అన్వర్ ఉల్ హక్ శుక్రవారం అసెంబ్లీలో తెలిపారు. 13 నియోజకవర్గాలకు ఆహారం, మందులతో సహా అవసరమయ్యే అన్ని అవసరాల సరఫరాల కోస ప్రాంతీయ ప్రభుత్వం ఒక బిలియన్ రూపాయల ($3.5 మిలియన్లు) అత్యవసర నిధిని కూడా సృష్టించిందని ఆయన వెల్లడించారు.
ఎల్‌ఓసీ వెంబడి ఉన్న ప్రాంతాల్లో రోడ్ల నిర్వహణకు ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యంలోని యంత్రాలను కూడా మోహరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 1000కిపైగా మదర్సాలు ఖాళీ చేయించారు. ఇప్పటికే సరిహద్దు గ్రామాల ప్రజలు బంకర్లు సిద్ధం చేసుకుంటున్నారు. అంతకుముందు, భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ జాతీయ విమానయాన సంస్థ గిల్గిట్, స్కార్డు, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఇతర ఉత్తర ప్రాంతాలకు బయలుదేరే అన్ని విమానాలను రద్దు చేసింది.
🚨BREAKING - “Instructions have been issued to stock food supplies for two months in the 13 constituencies along the Line of Control (LoC),” - The prime minister of Pakistan-occupied Kashmir, Chaudhry Anwar ul Haq, told the local assembly on Friday.
— The_anonymous_wave (@anonymouswave1) May 2, 2025
29 నగరాల్లో యుద్ధ సైరన్లు ఏర్పాటు
భారత్- పాక్ మధ్య యుద్ధ సైరన్ మోగింది. ఏ క్షణమైనా పాకిస్తాన్‌పై భారత్ దాడి చేయవచ్చు. పాకిస్తాన్‌లో యుద్ధ సైరన్లు మోగుతున్నాయి. 29 నగరాల్లో యుద్ధ సైరన్లు ఏర్పాటు చేసింది పాక్ ప్రభుత్వం. సైరన్లు మోగిస్తూ జనాల్ని అప్రమత్తం చేస్తుంది. భారత్ నుంచి వైమానిక దాడులు జరిగితే..జనం ఎలా ప్రాణాలు కాపాడుకోవాలని సూచనలు చేస్తోంది. భారత్ నుంచి క్షిపణి దాడులు ఉంటాయన్న సమాచారంతో ముందుగానే జనాల్ని అలర్ట్ చేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. సైరన్ హెచ్చరిక రాగానే బయటకు వెళ్లకుండా పిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా వారికి సూచించింది. ఇప్పటికే పాక్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ పాకిస్తాన్ భారత్ పై ఎటువంటి తీవ్రతను ప్రారంభించదని, అయితే రెచ్చగొడితే మాత్రం బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.