PM Modi: ప్రధాని మోదీకి స్టాండింగ్ ఓవేషన్..ఎక్కడో తెలుసా..

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎవరికీ దక్కని గౌరవాన్ని దక్కించుకుంటున్నారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నమీబియా వెళ్ళిన మోదీకి అక్కడి పార్లమెంట్ లో స్టాండింగ్ ఓవేషన్ లభించింది. దాంతో పాటూ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా ఇచ్చారు. 

New Update
namibia

PM Modi At Namibia

ప్రధాని మోదీ మరో రికార్డ్ ను సొంతం చేసుకున్నారు. దశాబ్దాల తర్వాత నమీబియా వెళ్ళిన మొదటి భారత ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించారు. 27 ఏళ్లలో ఒక భారతదేశ ప్రధాని నమీబియాను సందర్శించడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు ఈ దేశానికి మోడీతో కలిపి ముగ్గురు భారత ప్రధానులు మాత్రమే వెళ్లారు.  ఐదు దేశాల పర్యటనలో మోదీ ఈరోజు నమీబియా వెళ్ళారు.  అక్కడ పార్లమెంటులో ప్రసంగించారు. అయితే అంతకు ముందు ప్రధాని మోదీ వస్తున్నప్పుడు నమీబియా పార్లమెంటు సభ్యులు లేచి నిల్యుని స్టాండింగ్ ఓవేషన్ తో స్వాగతం పలికారు. చప్పట్లతో సాదరంగా ఆహ్వానించారు.  అంతేకాకుండా ప్రధానికి నమీబియా దేశ అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్ ప్రదానం చేశారు. 

పార్లమెంట్ లో ప్రసంగించిన ప్రధాని మోదీ..

దీని తర్వాత ప్రధాని మోదీ పార్లమెంటులో మాట్లాడుతూ భారత్, నమీబియా దేశాల మధ్య సంబంధాలను హైలెట్ చేశారు.   మీ స్వాతంత్ర్యంతో భారత్ మీ వెంట నిలబడిందని, భారత్ ఐక్యరాజ్యసమితిలో నైరుతి ఆఫ్రికా సమస్యని లేవనెత్తిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. నమీబియా మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. భారతదేశం కూడా ఒక పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చిన మహిళ దేశానికి అధ్యక్షురాలు అయిన విషయాన్ని చెప్పారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు