/rtv/media/media_files/2025/03/11/OOm87Ih7TynIWmz1eYwT.jpg)
PM Modi becomes first Indian to receive Mauritius's highest honour
భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అత్యున్నత పురస్కారం లభించింది. మారిషన్ పర్యటనకు వెళ్లిన ప్రధానికి ఆ దేశం తమ అత్యున్నత పురస్కారమైన ''ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్''తో సత్కరించింది. మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గులాం ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. ఆ దేశంలో ఇలాంటి గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు.
Also Read: రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో ట్విస్ట్.. కర్ణాటక సర్కార్ కీలక ఆదేశం
ప్రస్తుతం ప్రధాని మోదీ మారిషస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ.. ఆ దేశ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాం, ఆయన సతీమణి వీణా రామ్‌గులాంలకు ‘ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ)’ కార్డులను ప్రకటించారు. పర్యటనలో భాగంగా అక్కడ ఉంటున్న భారతీయులతో కూడా ప్రధాని మోదీ భేటీ అయారు. ఈ సందర్భంగా ఆయన వాళ్లతో పలు విషయాలు పంచుకున్నారు.
Also Read: సౌందర్యది హత్యే! చంపింది మోహన్ బాబే.. మంచు మోహన్ బాబుపై సంచలన ఫిర్యాదు
'' సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున మారిషస్‌కి వచ్చాను. అప్పటికీ కూడా హోలీ వేడుకకు పది రోజులే ఉంది. ఈసారి హోలీ రంగులను నాతో పాటు భారత్‌కు కూడా తీసుకెళ్తాను. మారిషస్‌కు వస్తే నా సొంత ప్రదేశంలా అనుభూతి కలుగుతుంది. మనమంతా ఒకే కుటుంబమని'' ప్రధాని మోదీ అన్నారు. అలాగే తనను ఆ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించిన మారిషన్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాంకు ధన్యవాదాలు తెలిపారు. ఇంతకుముందు మోదీకి రష్యా.. తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందజేసిన సంగతి తెలిసిందే.
Also Read: ఆయుధాల దిగుమతిలో భారత్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో ఉక్రెయిన్ !