Breaking: అమెరికాలో మళ్ళీ కాల్పులు..ఈసారి ఏకంగా భద్రతా అధికారులపైనే..

అమెరికాలోని పిట్సిల్వేనియా కౌంటీలోని గ్రెట్నాలో కొంతసేపటి క్రితం కాల్పులు జరిగాయి. ఇందులో నలుగురు భద్రతా అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. హోమ్ స్టెడ్ డ్రైవ్ లోని ఓ ఇంటిపై గుర్తు తెలియని దుండుగుడు దాడి చేశాడు.

New Update
us firing

Firing In Gretna, Pittsylvania County

అమెరికా భద్రతా ఏజెన్సీలు ఉన్నచోటనే కాల్పులకు తెగబడ్డారు దుండగులు. పిట్సిల్వేనియా కౌంటీలోని గ్రెట్నాలో కౌంటీ షెరీఫ్ కార్యాలయం, కాంప్‌బెల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం, అమ్హెర్స్ట్ కౌంటీ షెరీఫ్, డాన్విల్లే పోలీస్ డిపార్ట్‌మెంట్, వర్జీనియా స్టేట్ ట్రూపర్స్, గ్రెట్నా ఫైర్ అండ్ రెస్క్యూ, హర్ట్ ఫైర్ డిపార్ట్‌మెంట్, యుఎస్ మార్షల్స్,  సెంట్రా మెడికల్ హెలికాప్టర్‌తో సహా బహుళ ఏజెన్సీలున్న ఏరియాలో దుండగులు కాల్పులు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన ఈ కాల్పుల్లో నలుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు