PAK PM: ఏం మనుషులర్రా భాయ్..యుద్ధంపై మళ్ళీ నోరు పారేసుకున్న పాక్ ప్రధాని

పహల్గాం ఉగ్రదాడి చాలా విచారకరం అంటూనే తరువాత జరిగిన పరిణామాలపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ నోరు పారేసుకున్నారు. 1971 యుద్ధం నాటి ఓటమికి తాము ప్రతీకారం తీర్చుకున్నామంటూ అర్థం పర్ధం లేని మాటలు మాట్లాడారు. 

author-image
By Manogna alamuru
New Update
Pakistan PM Shehbaz Sharif

Pakistan PM Shehbaz Sharif

భారత సైన్యం చేసిన ఆపరేషన్‌ సిందూర్‌లో ముజఫరాబాద్‌లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఆ సందర్భంగా మాట్లాడుతూ..మళ్ళీ అవాకులు చవాకులు పేలారు. 1971 యుద్ధం నాటి ఓటమికి తాము ప్రతీకారం తీర్చుకున్నామంటూ వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడి దురదృష్టకరం. కానీ తర్వాత భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అవి ఏ క్షణంలోనైనా తీవ్ర రూపం దాలుస్తాయోమో అనుకున్నాం. ఉగ్రదాడి ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని కోరినా భారత్‌ దాన్ని తిరస్కరించిందన్నారు ఫెహబాజ్. పహల్గాం ఘటనపై అంతర్జాతీయ స్థాయి దర్యాప్తునకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. 

చర్చలకు సిద్ధమంటూ కాశ్మీర్ గురించి..

పహల్గాం దాడి, ఆ తరువాత పరిణామాలపై పాక్ ప్రధాని పై విధంగా మాట్లాడ్డం మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలానే ఆయన నోరు పారేసుకున్నారు. అంతు ముందు భారత్ శాంతి చర్చలకు రావాలని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. భారత్ తో చర్చలలో కాశ్మీర్ అంశం కూడా ఉంటుందని ఆయన చెప్పారు. జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్‌ పదేపదే స్పష్టం చేస్తున్నా షరీఫ్ మళ్ళీ కాశ్మీర్ గురించి చర్చల చేయాలని అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పంజాబ్ ప్రావిన్స్‌లోని కమ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. షెహబాజ్ తో పాటు ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఎయిర్ స్టాఫ్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ వైమానిక స్థావరాన్ని సందర్శించారు.

 today-latest-news-in-telugu | pakistan | pm shehbaz sharif | IND-PAK War 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు