/rtv/media/media_files/2026/03/03/civil-war-2026-03-03-15-38-37.jpg)
pakistan civil war
Pakistan civil war : పాకిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. అక్కడ కేవలం దేశీయ ఘర్షణలే కాకుండా, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం, తీవ్రమైన అంతర్గత అశాంతి నెలకొన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో ఏర్పడ్డ విభేదాల కారణంగా ఆ దేశంతో 'నేరుగా యుద్ధం' చేస్తోంది పాకిస్తాన్. ఫిబ్రవరి చివరి వారం నుండి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి.సరిహద్దుల్లోని ఉగ్రవాద స్థావరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేయగా, ప్రతిగా ఆఫ్ఘన్ దళాలు పాకిస్తాన్ సరిహద్దు పోస్ట్‌లపై దాడులు చేస్తున్నాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఈ పరిస్థితిని Open War గా అభివర్ణించారు. కాబూల్, కాందహార్ వంటి నగరాల్లో పేలుళ్లు సంభవించాయి. -- మరోవైపు ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ దాడులతో పాక్ ఉక్కిరిబిక్కిరవుతోంది.ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ తిరుగుబాటు దారులు ప్రభుత్వ భవనాలు, సైన్యం చెక్‌పోస్ట్‌లపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు.
మరోవైపు దేశంలో-- షియా గ్రూప్, సున్నీ గ్రూపుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మృతిపై షియా గ్రూప్ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తోంది. అయితే దాన్ని వ్యతిరేకిస్తున్న సున్నీ వర్గం -- షియా గ్రూప్‌లపై దాడులకు పాల్పడుతుంది. ఇరాన్‌కు సపోర్ట్ చేయలేదని పాకిస్తాన్‌లో షియా గ్రూప్ తిరుగుబాటు లేవనెత్తింది. ఈ క్రమంలో అమెరికా ఎంబసీపై దాడులు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతీగా -- పోలీసుల జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందగా, 50మందికి పైగా గాయపడ్డారు. కరాచీ, ఇస్లామాబాద్ వంటి నగరాల్లో అమెరికా కాన్సులేట్ల వద్ద జరిగిన ఘర్షణల్లో కనీసం 20 మందికి పైగా మరణించారు. పరిస్థితిని అదుపు చేయడానికి ఉత్తర గిల్గిత్-బాల్టిస్తాన్ వంటి ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించడంతో పాటు 3 రోజుల కర్ఫ్యూ విధించారు.
మరోవైపు పాకిస్తాన్ లోపల కూడా భద్రతా పరమైన సవాళ్లు ఎదుర్కొంటుంది. బలూచిస్తాన్‌లో వేర్పాటువాదులు (BLA (బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ) భద్రతా దళాలపై దాడులను తీవ్రతరం చేశారు. ఇటీవల జరిగిన భారీ దాడుల్లో సుమారు 48 మంది మరణించారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతంలో TTP (తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్) ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను తీవ్రతరం చేశారు, దీనివల్ల వేలాది మంది ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
అలాగేపాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత మొదలైన రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. అటు ఆర్థికంగా పాకిస్తాన్ భారీ ద్రవ్యోల్బణం, అప్పుల ఊబిలో ఉంది, ఇది సామాన్యులలో ప్రభుత్వంపై తీవ్ర అసహనాన్ని పెంచుతోంది. పాకిస్తాన్ ప్రస్తుతం ఒకవైపు సరిహద్దు యుద్ధం, మరోవైపు అంతర్గత తీవ్రవాదం మరియు తీవ్రమైన ప్రజా నిరసనలతో "అంతర్యుద్ధం" (Civil War) వైపు అడుగులు వేస్తోంది.
పాకిస్తాన్‌లోని అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్తాన్‌లో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) వంటి గ్రూపులు తమ స్వయంప్రతిపత్తి కోసం సైన్యంపై దాడులు తీవ్రతరం చేశాయి. ముఖ్యంగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్టులను వారు లక్ష్యంగా చేసుకుంటున్నారు. స్థానిక బలూచ్ యువతను సైన్యం అక్రమంగా నిర్బంధిస్తోందని ఆరోపిస్తూ మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున 'లాంగ్ మార్చ్'లు నిర్వహిస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలలో పాక్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. పాకిస్తాన్‌కు గుండెకాయ వంటి పంజాబ్ ప్రాంతం ప్రస్తుతం రాజకీయ యుద్ధభూమిగా మారింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు (PTI పార్టీ) ప్రస్తుత ప్రభుత్వం/సైన్యం మధ్య ఘర్షణలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు సైనిక స్థావరాలపై (జిన్నా హౌస్ వంటివి) దాడులు చేయడంతో పంజాబ్‌లో సైన్యంపై ఉన్న గౌరవాన్ని తగ్గించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 'వెంటిలేటర్'పై ఉంది:. నిత్యావసర వస్తువుల ధరలు (పిండి, పప్పులు, పెట్రోల్) సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ధరలు 30-40% పెరగడం వల్ల ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. ఐఎంఎఫ్ (IMF) నుండి పొందే బెయిల్ అవుట్ ప్యాకేజీల కోసం ప్రభుత్వం పన్నులు భారీగా పెంచింది. ఇది మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోం. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అట్టడుగుకు చేరడంతో దిగుమతులు నిలిచిపోయాయి, దీనివల్ల అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. పాకిస్తానీ రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే కనిష్ట స్థాయికి పడిపోయింది. భారీ విద్యుత్ బిల్లుల వల్ల ప్రజల నిరసనలు తెలుపుతున్నారు. అప్పులు చెల్లించలేక చైనా ప్రాజెక్టుల భద్రత కోసం పాక్ సైన్యం కష్టపడుతోంది.
Follow Us