ఘోర ప్రమాదం.. 94 మంది మృతి

నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలి 94 మంది మృతి చెందారు. జిగివా రాష్ట్రంలోని మజియా అనే పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ విషాదం చోటుచేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
petrol tank

నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలి 90 మందికి పైగా మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిగివా రాష్ట్రంలోని మజియా అనే పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి కనో అనే ప్రాంతం నుంచి నుంచి వస్తోన్న పెట్రోల్ ట్యాంకర్‌ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఆ ట్యాంకర్ అదుపుతప్పి రహదారిపై బోల్తా పడింది. దీంతో కొందరు స్థానికిలు ఇంధనం కోసం ఆ ట్యాంకర్ వద్దకు వెళ్లారు. వారు పెట్రోల్ తీసుకుంటుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ట్యాంకర్ పేలిపోయింది.

Also Read: కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్!
  

ఈ విషాద ఘటనలో 94 మంది మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మరో 50 మంది గాయాలపాలయ్యారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స ఉందని చెబుతున్నారు. అయితే ట్యాంకర్‌ బోల్తా పడినప్పుడు దానికి దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించినా కూడా ఎవరూ వినలేదని.. ఒక్కసారిగా అక్కడికి జనాలు రావడంతో చాలామంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందని అధికారులు తెలిపారు. 

Also Read: కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు!

ఇదిలాఉండగా ఇటీవల రష్యాలోని సౌత్‌ చెచ్‌న్యాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పెట్రోల్‌ పంపులో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. సమాచారం మేరకు అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశాయి.

Also Read: రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు!

ఇటీవల ఆర్మేనియా దేశంలో కూడా నాగర్నో - కారాబఖ్‌ ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. 300 మందికిపైగా గాయపడ్డారు. తమ వెహికిల్స్‌లో ఇంధనాన్ని నింపుకునేందుకు అధిక సంఖ్యలో ప్రజలు ఆ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నారు. ఆ సమయంలోనే  ఒక్కసారిగా పేలుడు జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడున్నవారు భయాందోళనలతో పరుగులు పెట్టారు.

Also Read: ఖగోళ అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు రాదు!

Advertisment
Advertisment
తాజా కథనాలు