పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో పెను విషాదం చోటుచేసుకుంది. బర్సాలోగా అనే పట్టణంలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కొన్ని గంటల్లోనే దాదాపు 600 మంది ప్రజలను కాల్చి చంపేశారు. ఆగస్టులో జరిగిన ఈ భయానక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆగస్టు 24న బర్సాలోగో పట్టణంపై ఉగ్రవాదాలు బైక్‌లపై దూసుకొచ్చారు. ఎవరు కనిపిస్తే వాళ్లని పిట్టల్లా కాల్చి చంపేశారు. మృతుల్లో అత్యధిక మంది మహిళలు, చిన్నారులే కావడం ఆందోళన కలిగిస్తోంది. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ రెబల్స్ ఈ కిరాతకానికి పాల్పడినట్లు పలు కథనాలు వెల్లడించాయి.
Also Read: ఈ పెయింటింగ్ ఖరీదు..రూ.55 కోట్లు!