Iran : మేం ట్రంప్‌ను వదిలిపెట్టం.. ఇరాన్ సంచలన హెచ్చరిక!

పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, ఇరాన్ భద్రతా విభాగం చీఫ్ అలీ లారీజానీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
iran

పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, ఇరాన్ భద్రతా విభాగం చీఫ్ అలీ లారీజానీ సంచలన వ్యాఖ్యలు చేశారు.శనివారం ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌తో మాట్లాడిన లారీజానీ, తమ నాయకుడి రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని సవాల్ చేశారు. 

మేం ట్రంప్‌ను వదిలిపెట్టం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, "మేం ట్రంప్‌ను వదిలిపెట్టం. మా నాయకుడిని చంపి, వెయ్యి మందికి పైగా మా ప్రజలను బలిగొన్నందుకు ఆయన భారీ మూల్యం చెల్లించాలి" అని హెచ్చరించారు. వెనిజులాలో జరిగిన పరిణామాలను చూసి ఇరాన్‌లో కూడా అలాంటిదే చేయవచ్చని ట్రంప్ తప్పుగా లెక్కవేస్తున్నారని, కానీ ఇప్పుడు ఆయన చిక్కుల్లో పడ్డారని లారీజానీ అన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X' లో కూడా ఆయన ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ, ప్రతీకారం తీర్చుకునే వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు.

లారీజానీ వ్యాఖ్యలపై డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. "అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఏం మాట్లాడుతున్నారో అంతకంటే తెలియదు. ఆయన గురించి నాకు అస్సలు పట్టింపు లేదని ట్రంప్ అన్నారు. ఇరాన్ నాయకులు బలహీనపడ్డారని, ఈ యుద్ధంలో వారు ఇప్పటికే ఓడిపోయారని ఎద్దేవా చేశారు. అమెరికా సైనిక చర్యలు కొనసాగుతాయని, ఇరాన్ "షరతులు లేని లొంగుబాటు" కు రావాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు.

మరోవైపు పొరుగు దేశాలపై ఇరాన్ చేసిన ఎదురుదాడులపై అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తొలుత క్షమాపణలు చెప్పారు. అయితే, ఆ తర్వాత తన మాటలను మార్చుకుంటూ.. తాము పొరుగు దేశాలను కాకుండా కేవలం ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని వివరణ ఇచ్చారు. అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్ మాట్లాడుతూ.. ఇరాన్‌పై సైనిక చర్య ఇప్పుడే మొదలైందని, రాబోయే రోజుల్లో దాడుల తీవ్రత ఊహించని విధంగా ఉంటుందని హెచ్చరించారు.

గత శనివారం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో మొదలైన ఈ యుద్ధం, నేడు 9వ రోజుకు చేరుకుంది. అగ్రరాజ్యం అమెరికా మొండితనం, ఇరాన్ ప్రతీకారేచ్ఛ మధ్య మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది.

Advertisment
తాజా కథనాలు