/rtv/media/media_files/2025/12/04/putin-2025-12-04-11-06-23.jpg)
గ్రీన్‌లాండ్‌ను అమెరికా కొనుగోలు చేయాలనుకుంటే మాకేం అభ్యంతరం లేదు.. అది ఆ రెండు దేశాల మధ్య వ్యవహారం అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా , చైనాల గురించే భయపడుతుంటే ..ఇప్పుడు ఆ దేశమే తమకు సంబంధం లేదని తేల్చి చెప్పేసింది. గ్రీన్‌లాండ్‌కు ఏం జరుగుతుందనేది మాకు అనవసరమైన విషయం. అది మా వ్యాపారం కాదు అని పుతిన్ స్పష్టం చేశారు. అమెరికా, డెన్మార్క్ ల మధ్య జరుగుతున్న గొడవ...తమకు ఏ మాత్రం ఆందోళన కలిగించడం లేదని...దానిని ఆ రెండు దేశాలే పరిష్కరించుకోవాలని అన్నారు. దాంతో పాటూ గ్రీన్ ల్యాండ్ విషయంలో డెన్మార్క్ తీరును కూడా పుతిన్ విమర్శించారు. ఆ ద్వీపాన్ని డెన్మార్క్ ఎప్పుడూ వలస ప్రాంతంగానే పరిగణించిందని విమర్శించారు. అయితే అది పాత విషయం. ఇప్పుడు దాని గురించి ఎవరూ ఆసక్తి చూపడం లేదనుకోండి" అని చమత్కరించారు.
మేము కూడా అమ్ముకున్నాంగా..
అమెరికా భూభాగాలను కొనుగోలు చేయడం ఇదేం మొదటిసారి కాదని పుతిన్ గుర్తు చేశారు. 1917లో డెన్మార్క్ తన ఆధీనంలో ఉన్న వర్జిన్ ఐలాండ్స్‌ను అమెరికాకు విక్రయించిన విషయాన్ని తెలిపారు. తమ దేశం రష్యా కూడా అలాస్కాను కేవలం 7.2 మిలియన్ డాలర్లకే అమ్మేసిందని ఒప్పుకున్నారు. గతంలో డెన్మార్క్, రష్యాలు తమ భూభాగాలను అమెరికాకు అమ్ముకున్నాయి కాబట్టి.. ఇప్పుడు గ్రీన్‌లాండ్ విషయంలో కూడా ఏదో ఒకటి తేల్చుకుంటారని పుతిన్ సెటైర్లు వేశారు.
మరోవైపు గ్రీన్ ల్యాండ్ విషయంలో ట్రంప్ కాస్త వెనక్కు తగ్గారు. ఈయూపై సుంకాలను కూడా వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రెట్టె తో ద్వైపాక్షిక సమావేశం అనంతరం ట్రంప్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి తన ట్రూత్ సోసల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నాటో సెక్రటరీ మార్క్ రొట్టెతో చర్చలు చాలా బాగా జరిగాయని...గ్రీన్ ల్యాండ్, ఆర్కిటిక్ విషయంలో ఓ ఫ్రేమ్ వర్క్ ను రూపొందించామని చెప్పారు. అది కార్యరూపం దాల్చితే అమెరికాతో పాటూ నాటూ మిత్ర దేశాలకూ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు.
Follow Us