/rtv/media/media_files/2024/11/01/KcCqWhsASE3FBWpIPAuB.jpg)
కృత్రిమ మేథను జనాలకు చేరువ చేసి టూల్ చాట్ జీపీటీ. 2022లో దీనిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఓపెన్ ఏఐ దీనిని ప్రవేశపెట్టింది. ఈ చాట్‌బాట్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీని తర్వాతనే మిగతావన్నీ వచ్చాయి. అయితే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా చాలాచోట్ల చాట్ జీపీటీ పని చేయడం లేదు. యూజర్లు చాట్ బాట్ ను ఓపెన్ చేస్తుంటే ఎర్రర్ వస్తోంది. చాట్ హిస్టరీ కూడా లోడ్ అవ్వడం లేదని సోషల్ మీడియాలో చాలామంది పోస్ట్ లు పెడుతున్నారు. చాట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఎర్రర్ మెసేజ్ లు వస్తున్నాయని చెబుతున్నారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా దేశాల్లో ఈ ప్రాబ్లెమ్ వస్తోంది.
Everyone running to X to see if ChatGPT is down. pic.twitter.com/9DX2fXliL6
— Heisenberg (@rovvmut_) July 16, 2025
🧩 Chat GPT is down.
— KaY〽️ (@KayBlockchain) July 16, 2025
How am I supposed to pretend I'm good at my job now? 💀 pic.twitter.com/XFMGjCOAPo
సమస్యను రిజాల్వ్ చేస్తున్నాం..
చాట్ జీపీటీ డౌన్ పై ఓపెన్ ఏఐ స్పందించింది. సమస్యను గుర్తించామని, దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. చాట్‌జీపీటీ రికార్డ్ మోడ్, సోరా, కోడెక్స్ వంటి సేవల్లో అంతరాయం ఉన్నట్లు చెప్పింది త్వరలోనే ప్రాబ్లెమ్ ను రిజాల్వ్ చేస్తామని అంది. ఈ నెలలో చాట్ జీపీటీ పని చేయకపోవడం ఇది రెండోసారి.