China:మమ్మల్ని ఎవరూ ఆపలేరు..తైవాన్‌కు చైనా వార్నింగ్

న్యూఇయర్ సందర్భంగా తైవాన్‌కు చైనా అధ్యక్షడు జిన్ పింగ్ వార్నింగ్ ఇచ్చారు. తైవాన్‌తో తమ పునరేకీకరణను ఎవరూ ఆపలేరని అన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయాన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

New Update
XI jin ping

మొత్తం ప్రపంచం కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతోంది. చైనా కూడా ఈ వేడుకల్లో భాగం అయింది.  ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ న్యూ ఇయర్ సందర్భంగా సందేశాన్ని ఇచ్చారు. ఇందులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి.  తైవాన్‌ చైనాలో కలుపుకోవడం ఎవరూ ఆపలేరని జిన్ పింగ్ అన్నారు.ఆ దేశంలో ఐనాలో అంతర్భాగమని ఆయన అన్నారు.    గత కొద్ది కాలంగా రెండు దేశాల మధ్యా ఈ విషయమై గొడవ నడుస్తోంది. చాలాసార్లు చైనా తైవాను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తోంది.  ఈ నేపథ్యంలో జిన్ పింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తైవాన్‌ చుట్టూ వైమానిక, నౌకాదళ విన్యాసాలు చేపట్టినట్లు కూడా ఆయన చెప్పారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న చైనా ప్రజలు ఒకే కుటుంబం. మన రక్త సంబంధాలను ఎవరూ తెంచలేరు మరియు మాతృభూమి పునరేకీకరణ యొక్క చారిత్రక ధోరణిని ఎవరూ ఆపలేరు అని జిన్ పింగ్ తన ప్రసంంలో చెప్పారు. 

చైనా, తైవాన్ వేరు కాదని ఈ రెండు దేశాలు కూడా ఒకే జీనవ విధానాన్ని సూచిస్తాయని పలు సందర్భాల్లో చైనా చెప్పింది.  వన్ చైనా విధానంలో తైవాన్ కూడా భాగమే అని చెబుతూ వస్తోంది. మే నెలలో తైవాన్ ప్రజాస్వామ్య ఎన్నికల్లో అధ్యక్షుడిగా లాయ్ చింగ్ తే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా  చైనా మూడు సార్లు తైవాన్ చుట్టూ సైనిక కసరత్తులు నిర్వహించింది. తైవాన్‌ని బలప్రయోగం ద్వారా తన ఆధీనంలోకి తీసుకురావడానికి చైనా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. చాలాసార్లు జల, గగన తలాల్లో నియమాలను ఉల్లంఘించింది. 

Also Read: HYDRA: అలా ఎలా చేస్తారు..హైడ్రీ తీరుపై హైకోర్టు ఆగ్రహం

Advertisment
తాజా కథనాలు