Trump Meets Biden:
రిపబ్లికన్, డెమోక్రటిక్ నేతల మధ్య హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.. డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఏడు స్వింగ్ రాష్ట్రాలతో పాటూ మెజార్టీ స్థానాల్లో గెలుప బావుటా ఎగుర వేశారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నికయి చరిత్ర సృష్టించారు ట్రంప్. అయితే ఈయన అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి ఇంకా టైమ్ ఉంది. జనవరి 20 తర్వాతనే ట్రంప్ వైట్ హౌస్‌కు వెళ్లగలుగుతారు. ఈ క్రమంలో ఈరోజు ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్ ఈరోజు వైట్ హౌస్‌కు అతిధిగా వెళ్ళారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అధికార మార్పిడి సజావుగా సాగేందుకు సహకరించుకోవాలని ఇరువురు నిర్ణయించుకున్నారు.
Also Read: స్పెర్మ్ ఇస్తా..ఐవీఎఫ్ చికిత్స కూడా ఉచితం– టెలీగ్రాం సీఈఓ వింత ఆఫర్
Also Read: MH:రాహుల్ బాబా విమానం మళ్ళీ కూలిపోతుంది–అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల తర్వాత పాత అధ్యక్షుడిని, కొత్త అధ్యక్షుడు కలవడం ఆనవాయితీగా వస్తోంది ఎప్పటి నుంచో. దాని ప్రకారమే ఈరోజు ట్రంప్, బైడెన్ భేటీ జరిగింది. అయితే 2020లో ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్.. విజయం సాధించిన జో బైడెన్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించలేదు. అంతేకాకుండా బైడెన్ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి కూడా హాజరుకాలేదు. అయితే అవేమీ మనసులో పెట్టుకోకుండా బైడెన్ మాత్రం మునుపటి సంప్రదాయాన్నే కొనసాగించారు. ఆయనే స్వయంగా ట్రంప్‌కు ఆహ్వానం పంపారు. వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనాలని పిలిచారు. దీనికే ట్రంప్ ఈరోజు హాజరయ్యారు.
Also Read: Movies: సూర్య కెరీర్‌లోనే అతి పెద్ద సినిమాగా కంగువ..విశేషాలివే..
Also Read: KTR Arrest: బిగుస్తున్న ఉచ్చు.. ఏ క్షణమైన కేటీఆర్ అరెస్ట్!