New Jersey Flash Floods: అమెరికా ముంచెత్తుతున్న వరదలు..ఈసారి న్యూ జెర్సీలో..

వరుసపెట్టి అమెరికాను వరదలు ముంచెత్తుతున్నాయి.  న్యూ మెక్సికో, టెక్సాస్ ల తర్వాత ఇప్పుడు న్యూ జెర్సీలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 

New Update
new Jersy

New Jersey Flash Floods

సోమవారం ఆగకుండా కురిసిన వర్షం న్యూ జెర్సీని ముంచెత్తింది. అక్కడి రోడ్లన్నీ జలమయ్యాయి. దీంతో న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రేపు కూడా అత్యధిక వర్ష పాతం హెచ్చరికలు ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అత్యంత అవసరమైతేనే తప్ప ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు.  

రోడ్లు మునిగి, చెట్లు కూలి..

యూనియన్ కౌంటీతో సహా అనేక ప్రాంతాలు తీవ్ర వర్షానికి ప్రభావితమయ్యాయి. రోడ్లు మునిగిపోయాయి. చెట్లు కూలిపోయాయి. కార్లు మునిగిపోయేటతటి వర్షం అక్కడ పడింది. న్యూజెర్సీ టర్న్‌పైక్ వంటి ప్రధాన మార్గాలు అనేక ప్రాంతాలలో నీటిలో మునిగిపోయాయి. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. న్యూవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి ఎనిమిది వరకు ఫ్లైట్లు తిరగలేదు. దీని కారణంగా చాలా విమానాలు రద్దవ్వగా..మరికొన్ని ఆలస్యంగా నడిచాయి.  

Also Read: Student Suicide: లైంగికవేధింపుల కారణంగా ఓడిశా ఏఐఐఎమ్ఎస్ విద్యార్థిని ఆత్మహత్య

Advertisment
Advertisment
తాజా కథనాలు