Canda: కెనడా వెళ్లేవారికి అలెర్ట్.. పౌరసత్వ నిబంధనల్లో కీలక మార్పులు

కెనడాలో పౌరసత్వానికి సంచలన అప్‌డేట్ వచ్చింది. అక్కడి ప్రభుత్వం దీనికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేసింది. కెనడా బయట జన్మించిన కెనడియన్ల పిల్లలకు పౌరసత్వం అందించే అవకాశాన్ని ఇచ్చింది.

New Update
New citizenship rules for Canadians born or adopted abroad are now in effect

New citizenship rules for Canadians born or adopted abroad are now in effect

కెనడాలో పౌరసత్వానికి సంచలన అప్‌డేట్ వచ్చింది. అక్కడి ప్రభుత్వం దీనికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేసింది. కెనడా బయట జన్మించిన కెనడియన్ల పిల్లలకు పౌరసత్వం అందించే అవకాశాన్ని ఇచ్చింది. కానీ తల్లిదండ్రులు మాత్రం మూడేళ్లపాటు కచ్చితంగా కెనడాలో ఉండాలనే నిబంధనను విధించింది. అయితే ఈ పౌరసత్వ చట్టంలో తీసుకొచ్చిన మార్పులు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అక్కడి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలామంది భారతీయులకు ప్రయోజనం చేకూరనుంది. 

Also Read: మెస్సికి అనంత్‌ అంబానీ ఇచ్చిన గిఫ్ట్‌ గురించి తెలిస్తే షాక్!

2025 డిసెంబర్ 15వ తేదీకి ముందు జన్మించిన లేదా పాత నియమాల వల్ల పౌరసత్వం రాని వారు కెనడియన్లుగా పౌరసత్వ రుజువు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఇమిగ్రేషన్, రిఫ్యూజీ, సిటిజెన్‌షిప్‌ కెనడా (IRCC) వెల్లడించింది. ఇక డిసెంబర్ 15 తర్వాత పిల్లలు జన్మిస్తే వారి తల్లిదండ్రులు కనీసం మూడేళ్ల పాటు కెనడాలో ఉన్నట్లు రుజువు చేసుకోవాలని పేర్కొంది. ఈ కొత్త నిబంధనల వల్ల ఇది ఎంతోమంది పౌరులకు ప్రయోజనం చేకూరనుందని నిపుణులు చెబుతున్నారు.  

Also Read: ఆస్ట్రేలియా ఉగ్రదాడి వెనుక హైదరాబాద్ టెర్రరిస్ట్.. షాకింగ్ విషయాలు

ఇదిలాఉండగా కెనడాలో 2009 నుంచి ఇప్పటిదాకా అమల్లో ఉన్న రూల్ ప్రకారం.. కెనడా బయట జన్మించిన లేదా దత్తత తీసుకున్న పిల్లల తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా కెనడాలో పుట్టి ఉండాలి. లేదా చనిపోయి ఉండాలి. దీనివల్లే చాలామంది పౌరసత్వాన్ని కోల్పుతున్నారు. 2023లో ఆంటారియో కోర్టు ఈ నిబంధనను రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పునిచ్చింది. మరోవైపు ప్రభుత్వం కూడా దీనిపై అప్పీలు చేయలేదు. ఈ క్రమంలోనే తాజాగా కెనడా పౌరసత్వ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చారు.  

Advertisment
తాజా కథనాలు