పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. హసన్ నస్రల్లా మృతదేహం లభ్యం

ఇజ్రాయెల్‌ దాడులతో హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లా హతమైన సంగతి తెలిసిందే. అయితే అతడి మృతదేహం లభ్యమైంది. బీరుట్‌లోని దక్షిణ శివారు ప్రాంతం నుంచి తమ నాయకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని హెజ్‌బొల్లా ప్రకటించింది.

New Update
Nasrallah

 హెజ్‌బొల్లా నిర్మూలణే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడుల చేస్తోంది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లా హతమైన సంగతి తెలిసిందే. అయితే అతడి మృతదేహం లభ్యమైంది. బీరుట్‌లోని దక్షిణ శివారు ప్రాంతం నుంచి తమ నాయకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని హెజ్‌బొల్లా ప్రకటించింది. నస్రల్లా మృతదేహంపై ప్రత్యక్షంగా ఎలాంటి గాయాలు కనిపించలేదని తెలుస్తోంది. దీంతో బాంబు దాడులు జరిగినప్పుడు షాక్‌కు గురై ఆయన మరణించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: బంకర్-బస్టర్ బాంబ్.. హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ భయంకర విధ్వంసం!

ఇదిలాఉండగా.. ఇజ్రాయెల్‌ దాడుల్లో హసన్ నస్రల్లాతో పాటు ఆయన కుమార్తె కూడా మరణించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తతలు చెలరేగాయి. దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెజ్‌బొల్లా ప్రకటించింది. పాలస్తీనాకు మద్దతు ఇవ్వడంతో పాటు శత్రువుపై యుద్ధం కొనసాగిస్తామని పేర్కొంది. 

Advertisment
తాజా కథనాలు