BIG BREAKING: మరోసారి భారీ భూకంపం.. ఒకేసారి రెండు దేశాల్లో.. భయంతో ప్రజలు పరుగులు

మయన్మార్‌లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందళోనతో పరుగులు పెట్టారు. 

New Update
BREAKING NEWS

BREAKING NEWS

మయన్మార్‌లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందళోనతో పరుగులు పెట్టారు. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగనట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Putin Strong Warning: ఖబడ్దార్..భారత్, చైనాలో అలా మాట్లాడ్డానికి వీల్లేదు...ట్రంప్ కు పుతిన్ వార్నింగ్

మరోసారి ఆఫ్గాన్‌లో భారీ భూకంపం..

మయన్మార్‌తో పాటు ఆప్ఘనిస్థాన్‌లో కూడా నేడు మరోసారి భూకంపం వణికించింది. మూడు రోజుల క్రితం వచ్చిన భారీ భూకంపం నుంచే ఆఫ్గాన్ ఇంకా తేరుకోలేదు. తాజాగా మరోసారి భూకంపం హడలెత్తించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.8గా నమోదైంది. 135 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. బుధవారం రాత్రి కూడా 4.3 తీవ్రతతో ఒకసారి భూకంపం వచ్చింది. 

మళ్లీ కొన్ని గంటల వ్యవధిలోనే భూకంపం రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఆఫ్గాన్‌లో వచ్చిన భూకంపం వల్ల 1400 మందికి పైగా మృతి చెందారు. ఆ భూకంపం నుంచి తేరుకోకముందే మరో భూకంపం ప్రజలను భయపెడుతోంది. ఇదిలా ఉండగా తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో 8 కి.మీ లోతులో 6.0 తీవ్రతతో ఇటీవల భూకంపం సంభవించింది. 1400 మందికి పైగా మృతి చెందడంతో పాటు వెయ్యి మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. వందలకొద్ది ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి.

ఇది కూడా చూడండి: US Economic Crisis:  ట్రంప్ తల తిక్క నిర్ణయాలు.. ఆర్థిక మాంద్యంలో అమెరికా

Advertisment
తాజా కథనాలు