/rtv/media/media_files/2026/03/01/ali-khamenei-2026-03-01-20-22-47.jpg)
Ali Khamenei
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో కర్ణాటకలోని ఓ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామంలో మూడు రోజులు పాటు సంతాప దినాలు ప్రకటించారు. అక్కడి స్థానికులు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక వివరాల్లోకి వెళ్తే చిక్కబళ్లాపుర జిల్లాలోని అలీపూర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి అలీ ఖమేనికి మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ ఊరి జనాభాలో 99 శాతం మంది షియా ముస్లింలు ఉన్నారు.
తమ పూర్వీకులు ఇరాన్ నుంచి ఈ గ్రామానికి వచ్చినట్లు అక్కడి ప్రజలు భావిస్తారు. చాలామంది ఆ గ్రామంలో రత్నాల వ్యాపారం చేస్తూ ఇరాన్‌తో పాటు ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలకు వాటిని ఎగుమతి చేస్తుంటారు. అంతేకాదు 1986లో అలీపూర్ గ్రామానికి చెందిన వ్యాపారులు తమ వ్యాపారం కోసం ఎక్కువగా ఇరాన్‌కు వెళ్తుండేవారు. ఈ క్రమంలోనే అలీ ఖమేనీకి, అలాగే మత గురువైన అయతుల్లా ఇమామ్ ఖమేనీ మత బోధనలకు ఆ గ్రామ ప్రజలు ప్రభావితమయ్యారు. అయతుల్లా ఇమామ్ ఖమేనీ పేరుతో ఓ ఇంటిని కూడా కట్టారు.
Also Read: టెక్సాస్ లో కాల్పులు - ముగ్గురు మృతి, 14 మందికి గాయాలు
ఇరాన్ ప్రభుత్వం సాయంతో 1986లో ఓ ఆస్పత్రిని కూడా నిర్మించారు. దీన్ని ప్రారంభించేందుకు అలీ ఖమేనీ అలీపూర్ గ్రామానికి వచ్చారు. అక్కడి స్థానికులు ఖమేనీ బోధనలను మతపరంగా పాటించారు. అంతేకాదు అలీటీవి అనే స్థానిక టెలివిజన్‌లో ఛానల్‌లో కూడా ఖమేనీ భోదనలు ప్రతిరోజూ ప్రసారం చేస్తుంటారు. అందుకే ఖమేనీకి ఈ గ్రామానికి ఎంతో అనుబంధం ఉంది.
తాజాగా ఇజ్రాయెల్-అమెరికా కలిసి చేసిన దాడులల్లో అలీ ఖమేనీ మరణించడంతో అక్కడి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆదివారం అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. తమ గ్రామంతో ఖమేనీకి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇదిలాఉండగా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరెజా అరాఫీని నియమించిన సంగతి తెలిసిందే.
Also Read: అమెరికా ప్లాన్ మాములుగా లేదుగా.. ఖమేనీని ఎలా హతమార్చిందో తెలుసా ?
Follow Us