మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న డెన్మార్క్‌ బ్యూటీ

2024 మిస్ యూనివర్స్‌ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన భామకు దక్కింది. విక్టోరియా కెజార్ థెల్విగ్ ఈ విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్నారు. మెక్సికో వేదికగా ఈ పోటీలు జరిగగా.. మొత్తం 125 మంది విశ్వ సుందరి కీరిటం కోసం పోటీ పడ్డారు.

New Update
victo


ప్రపంచవ్యాప్తంగా జరిగే అందాల పోటీల్లో మిస్ యూనివర్స్‌కు ఉండే క్రేజే వేరు. అయితే తాజాగా జరిగిన మిస్ యూనివర్స్‌ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన భామకు దక్కింది. విక్టోరియా కెజార్ థెల్విగ్ ఈ విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్నారు. మెక్సికో వేదికగా ఈ పోటీలు జరిగాయి. మొత్తం 125 మంది విశ్వ సుందరి కీరిటం కోసం పోటీ పడ్డారు. చివరికి డెన్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల విక్టోరియా కెజార్ ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఇక నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా, మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్‌ట్రాన్ మొదటి, రెండో రన్నరప్‌లుగా నిలిచారు. 

Also Read: రహస్యంగా వారసుడుని ఎన్నుకున్న ఖమేనీ.. కారణమేంటి?

విక్టోరియా కెజార్‌కు షెన్నిస్ పలాసియోస్ కిరిటాన్ని అందజేశారు. ''కొత్త శకం ప్రారంభమైంది.''73వ విశ్వ సుందరిగా విజయం సాధించినందుకు అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో స్పూర్తి నింపేలా మీ ప్రయాణం ఇలాగే కొనసాగాలాని ఆశిస్తున్నామని'' మిస్ యూనివర్స్ టీమ్ పేర్కొంది. ఈ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ నుంచి రియా సింఘా పాల్గొన్నారు. కానీ ఆమె టాప్ 5లో కూడా నిలవలేకపోయారు. 

Also Read: అమ్మో దెయ్యం.. 50మంది మృతి, వణికిపోతున్న తెలంగాణ వాసులు!

ఇక్కడ మరో విషయం ఏంటంటే మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్న తొలి డెన్మార్క్ భామ విక్టోరియానే కావడం విశేషం. 2004లో సోబోర్గ్‌లో జన్మించిన ఆమె.. బిజినెస్ అండ్‌ మార్కెటింగ్‌లో డిగ్రీ పొందారు. ఆ తర్వాత వ్యాపారవేత్తగా కూడా మారారు. డ్యాన్సులో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. మానసిక ఆరోగ్యం, మూగజీవాల సంరక్షణ వంటి వాటిపై కూడా పోరాటం చేస్తున్నారు. అందాల పోటీల్లోకి రావాలనే ఉద్దేశంతో మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు. మిస్‌ డెన్మార్క్‌గా కూడా తొలిసారి విజయాన్ని అందుకున్నారు. 2022లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో టాప్ 20లో నిలిచారు. ఇక 2024లో ఏకంగా మిస్ యూనివర్స్ కిరిటాన్ని సొంతం చేసుకొని ప్రశంసలు అందుకుంటున్నారు. 

Also Read: పిచ్చెక్కిస్తున్న పిల్లి సంపాదన.. రూ.800 కోట్లకు పైగా.. ఎలాగంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు