Epstein Files: అంతర్జాతీయ రాజకీయాల్లో 'ఎప్‌స్టీన్' ప్రకంపనలు.. దేశాధినేతల పీఠాలకే ఎసరు

ఎప్‌స్టీన్ ప్రకంపనలు అగ్రరాజ్యం అమెరికాను దాటి ఐరోపా ఖండంలోని ప్రధాన దేశాలను తాకాయి. ఈ స్కాండల్ ప్రభావంతో ఇప్పటికే పదికి పైగా దేశాల్లో మంత్రులు, దౌత్యవేత్తలు, ఉన్నత స్థాయి అధికారులు తమ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

New Update
epstein

epstein

అమెరికా మల్టీ మిలియనీర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన రహస్య పత్రాలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ వర్గాలను వణికిస్తున్నాయి. ఈ ఎప్‌స్టీన్ ప్రకంపనలు అగ్రరాజ్యం అమెరికాను దాటి ఐరోపా ఖండంలోని ప్రధాన దేశాలను తాకాయి. ఈ స్కాండల్ ప్రభావంతో ఇప్పటికే పదికి పైగా దేశాల్లో మంత్రులు, దౌత్యవేత్తలు, ఉన్నత స్థాయి అధికారులు తమ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఫైల్స్ వల్ల అత్యధికంగా ప్రభావితమైన దేశం బ్రిటన్. ఈ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ప్రస్తుతం తన రాజకీయ జీవితంలోనే అత్యంత కఠినమైన దశను ఎదుర్కొంటున్నారు. అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారిగా పనిచేసిన పీటర్ మాండెల్సన్‌కు ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధాలు ఈ ఫైల్స్ ద్వారా బయటపడ్డాయి. మాండెల్సన్ గతంలో ప్రభుత్వ రహస్యాలను, కీలకమైన దౌత్య సమాచారాన్ని ఎప్‌స్టీన్‌కు చేరవేసినట్లు ఆధారాలు లభించాయి. ఇటువంటి వివాదాస్పద వ్యక్తిని కీలక పదవిలో నియమించినందుకు ప్రధాని స్టార్మర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోర్గాన్ మెక్‌స్వీనే ఇప్పటికే రాజీనామా చేశారు.

ఇది కూడా చూడండి: Malreddy Ranga Reddy : మంత్రి పదవి కోసం రాజీనామా చేస్తా..ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు

బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ పేరు మరోసారి ఈ స్కాండల్‌లో ప్రముఖంగా వినిపిస్తోంది. 2001 నుంచి 2011 మధ్య కాలంలో ఆయన ప్రత్యేక వాణిజ్య ప్రతినిధిగా ఉన్నప్పుడు అధికారిక పర్యటనలు, ప్రభుత్వ పెట్టుబడులకు సంబంధించిన అతి రహస్య నివేదికలను ఎప్‌స్టీన్‌కు ఈమెయిల్స్ ద్వారా పంపినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. దీనిని అధికారిక రహస్యాల చట్టం కింద తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

ఇది కూడా చూడండి: పశ్చిమ బెంగాల్‌ SIR ప్రక్రియను పొడిగించండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

బ్రిటన్‌తో పాటు నార్వే, స్వీడన్, స్లొవేకియా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కూడా ఎప్‌స్టీన్ సంబంధాలు బయటపడటంతో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. జోర్డాన్‌లో నార్వే రాయబారిగా పనిచేస్తున్న మోనా జూల్, ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నట్లు రుజువు కావడంతో సస్పెన్షన్‌కు గురై ఆ తర్వాత రాజీనామా చేశారు. స్లొవేకియా దేశ మాజీ విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు మిరోస్లావ్ లజక్ కూడా ఈ వివాదంలో చిక్కుకుని తన పదవిని కోల్పోయారు. స్వీడన్ సీనియర్ దౌత్యవేత్త జోనా రుబిన్‌స్టీన్ కూడా ఎప్‌స్టీన్‌తో ఉన్న పరిచయాల కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఇది కూడా చూడండి: రూ.54 వేల కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

అసలు ఏమిటీ ఎప్‌స్టీన్ వివాదం?

జెఫ్రీ ఎప్‌స్టీన్ ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి. లైంగిక వేధింపులు, అమ్మాయిల అక్రమ రవాణా వంటి కేసుల్లో అరెస్ట్ అయి.. 2019లో జైలులో మరణించారు. అయితే ఆయనతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. తాజాగా విడుదలైన పత్రాలు కేవలం వ్యక్తిగత సంబంధాలనే కాకుండా దేశాల మధ్య జరిగే దౌత్యపరమైన లావాదేవీలను ఎప్‌స్టీన్ వెల్లడించారు.

ఇది కూడా చూడండి: Today Horoscope: ఈ రాశుల వారు జాగ్రత్త.. ఈ నియమాలు పాటించకపోతే అంతే సంగతులు

Advertisment
తాజా కథనాలు