/rtv/media/media_files/2025/03/30/ftkebbzOcNbT579nuVHC.jpg)
Earthquake in Myanmar and philippiness
Earthquake : ఫిలిప్పీన్స్‌లోని మిండనోవా ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.6 గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పసిఫిక్ తీరంలో భారీగా అలలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భూకంపం తీవ్రతకు తీర ప్రాంతాలన్నీ అలజడికి గురయ్యాయి.ఉప్పెన ముంచుకొచ్చే ప్రమాదం ఉందంటూ తీర ప్రాంతాలను హెచ్చరించారు. తీర ప్రాంతాలను ఖాళీ చేయిన్నారు. భూకంపం ధాటికి పలు భవనాలు బీటలు వారాయి. భయంతో జనం వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు వార్తలు రాలేదు.
Scary...
— Patriot (@_Patriot1776Q_) October 10, 2025
Philippines 7.6 earthquake. pic.twitter.com/OPfE3UWmPS
ఫిలిప్పీన్స్ నైరుతి ప్రాంతంలోని దవావో ప్రావిన్స్ లో ఆ దేశ కాలమానం ప్రకారం.. ఉదయం 9:43 నిమిషాలకు ఈ భూకంపం సంభవించింది.ఇది రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదైంది. రాజధాని మనీలాకు నైరుతి దిశగా సుమారు 1,400 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ప్రావిన్స్. ఈ ప్రావిన్స్ లోని కోటాబాటా సిటీ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే, ఫిలిప్పీన్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వాల్కనాలజీ అండ్ సీస్మాలజీ తెలిపింది. సముద్ర తీర ప్రాంత నగరం ఇది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున భూఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల ఈ భూకంపం సంభవించినట్లు జియాలాజికల్ సర్వే తెలిపింది. దీని తీవ్రత దవావో ప్రావిన్స్ మొత్తం కనిపించింది. ఈస్ట్ సమర్, సదరన్ లెటె, లెటె, దినగట్ ఐలాండ్స్, సూరిగావ్ డెల్ నోర్టే, సూరిగావ్ డెల్ సుర్, దావవో ఓరియంటల్ తీరప్రాంతాల ప్రజలు భయంతో రోడ్ల మీదికి పరుగులు తీశారు. స్థానికులు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు.
A magnitude 7.6 earthquake struck off the coast of Manay, Davao Oriental at 9:43 AM on October 10, 2025, according to PHIVOLCS.
— lucas délaroche (@lucasdiminahal) October 10, 2025
Keep safe, Mindanao. 🙏 pic.twitter.com/IJMUoUyIca
ప్రధాన భూకంపం తర్వాత కూడా తేలికస్థాయి ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం కారణంగా మిండానావో, దావావో, కోటాబాటో నగరాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. క్లాసులను రద్దు చేసినట్లు కోటాబాటో సిటీ మేయర్ బ్రూస్ మటాబలావ్ ప్రకటించారు. అన్ని స్థాయిలలో తరగతులను నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. భూకంప తీవ్రత కోటాబాటోలో అధికంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రెండు నుంచి మూడు గంటల్లో సునామీ అలలు తీరాన్ని తాకొచ్చని వెల్లడించారు.ఈ స్థాయిలో భూమి ప్రకంపించడం సుదీర్ఘకాలం తరువాత ఇదే తొలిసారని తెలుస్తోంది.
మయన్మార్‌ను వణికించిన భూకంపం
మయన్మార్‌లో శుక్రవారం ఉదయం 05:53:57 IST (భారత ప్రామాణిక సమయం)న 4.2 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. దీనిని జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (NCS) ధృవీకరించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూకంపంతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదు. మయన్మార్‌ను నాలుగు టెక్టోనిక్ ప్లేట్లు (ఇండియన్, యురేషియన్, సుండా, మరియు బర్మా ప్లేట్లు) చుట్టుముట్టాయి, ఇవి భూకంప కార్యకలాపాలకు దారితీస్తాయని తెలుస్తోంది.
Also Read: హైకోర్టు స్టే.. ఎన్నికలకు రేవంత్ సర్కార్ ముందు 3 ఆప్షన్లు