Sheik Hasina: అక్కడ స్వేచ్ఛగా జీవిస్తున్నా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. ప్రస్తుతం తాను ఢిల్లీలో స్వేచ్ఛగా ఉంటున్నానని పేర్కొన్నారు. 2026లో బంగ్లాదేశ్‌లో జరగనున్న జాతీయ ఎన్నికల్లో పోటీ చేస్తానని పేర్కొన్నారు.

New Update
Sheik Hasina

Sheik Hasina

గతేడాది బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్ల వల్ల అప్పటి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి పారిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. ప్రస్తుతం తాను ఢిల్లీలో స్వేచ్ఛగా ఉంటున్నానని పేర్కొన్నారు. తన కుటుంబంపై హింసాత్మక దాడులు జరిగిన నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆవామీ లీగ్ పార్టీ నేతలపై వచ్చిన ఆరోపణలు, స్వదేశానికి వెళ్లిపోయే అంశాల గురించి మాట్లాడారు. '' 2026లో బంగ్లాదేశ్‌లో జరగనున్న జాతీయ ఎన్నికల్లో పోటీ చేస్తాం. తమ పార్టీ పోటీ చేయకపోతే లక్షలాది మంది మా సపోర్టర్లు ఆ ఎన్నికలను బహిష్కరిస్తారు.  

Also Read: మయన్మార్, థాయిలాండ్ సరిహద్దులో చిక్కుకున్న 500 మంది భారతీయులు

రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్‌లో అధికారం చేపట్టడానికి లేదా విపక్ష పాత్ర పోషించడానికి మా పార్టీ రెడీగా ఉంది. బంగ్లాదేశ్‌లో మళ్లీ రాజ్యాంగ పాలన రావాలంటే తమ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. దేశ భవిష్యత్తును ఒక్క వ్యక్తి గానీ కుటుంబం గానీ నిర్వహించాలని నేను భావించడం లేదు. నేను దేశం నుంచి వెళ్లిపోయిన తర్వాత అవాలీ లీగ్ నేతలపై దాడులు చేశారు. పార్టీని నిషేధించారు. దీన్నిబట్టి చూస్తే అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఓటమిని అంగీకరించింది. తర్వాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కావాలని'' షేక్ హసీనా అన్నారు. 

Also Read: మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్.. లొంగిపోయిన 51 మంది మావోలు

అంతేకాదు యూనస్ ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. తనను రాజకీయంగా పడగొట్టేందుకే నాపై కుట్రకు పాల్పడ్డారని తెలిపారు. అంతేకాదు తనపై అభియోగాలు నమోదు చేసే ముందు కూడా బంగ్లాదేశ్‌లోని కోర్టోలు కూడా ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు. అంతేకాదు తమ వాదనలు వినిపించేందుకు సైతం అవకాశం ఇవ్వేదని చెప్పారు. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో జరగనున్న జాతీయ ఎన్నికలపై తీవ్ర ఆసక్తి నెలకొంది. మరీ బంగ్లాదేశ్‌ ప్రజలు  ఎవరికి అప్పగిస్తారో తెలియాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే.

Also Read: కారు లేకుంటే అబ్బాయిలకు పిల్లనివ్వడం లేదు.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు