/rtv/media/media_files/2025/02/12/8iUwqeNykao1uUedZqjc.jpg)
World Most Corrupt Countries list 2024 Photograph: (World Most Corrupt Countries list 2024)
ప్రపంచంలోని అన్నీ దేశాల గవర్నమెంట్ సెక్టార్‌లో అవినీతిని బేరోమీటర్‌గా కొలుస్తారు. 2024 సంవత్సరానికి అవినీతి అవగాహన సూచిక (CPI) ప్రకారం.. డెన్మార్క్ ప్రపంచంలోనే అతి తక్కువ అవినీతి దేశంగా నిలిచింది. తరువాత ఫిన్లాండ్, సింగపూర్ మరియు న్యూజిలాండ్ ఉన్నాయి. ఈ నివేదికను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ లెక్కించింది. నిపుణులు, వ్యాపారవేత్తల ప్రకారం, ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిలను బట్టి ఈ సూచిక 180 దేశాలకు ర్యాంక్‌లు కేటాయిస్తారు. సున్నా నుండి 100 వరకు పాయింట్స్‌తో ఓ స్కేల్ ఉంటుంది. 100కు 100 పాయింట్లు వచ్చిన దేశాల్లో ఎక్కువ అవినీతి ఉన్నట్లు. 2024 నివేదిక ప్రపంచంలోని ప్రతి దేశంలో అవినీతి ప్రమాదకరమైన సమస్యగా ఉందని హైలైట్ చేసింది. కానీ కొన్ని దేశాలు అవినీతిని అంతం చేయడానికి, మార్పు కోసం పోరాడుతున్నాయని తెలిసింది.
Also Read : ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!
ప్రభుత్వం రంగ అవినీతి అవగాహన సూచికలో ఇండియా 96వ స్థానంలో ఉంది. ఈ ర్యాంక్‌లో ఇండియా గత సంవత్సరం కంటే 3 స్థానాలు దిగజారింది. 2024లో భారతదేశం స్కోరు 38 కాగా, 2023లో 39 పాయింట్ల స్కోరులో 93వ ర్యాంక్‌లో ఉంది. 2022లో 40 పాయింట్లతో భారత్ లో కొంచెం అవినీతి తక్కువగా ఉండేది.
Also Read: Trump-musk: మస్క్ కు హై పవర్ ఇచ్చిన ట్రంప్...ఇక కోతలే..కోతలు!
అవినీతి సూచిలో ఇండియా పొరుగు దేశాలైన పాకిస్తాన్ 135 ర్యాంక్, శ్రీలంక 121 ర్యాంక్. బంగ్లాదేశ్ 149 ర్యాంక్, చైనా 76వ స్థానంలో నిలిచాయి. అవినీతిలో అమెరికా 28, రష్యా 25వ ర్యాంకుల్లో ఉన్నాయి. దక్షిణ సూడాన్ కేవలం 8 పాయింట్లు మాత్రమే సాధించి అత్యంత అవినీతి దేశంగా నిలిచింది. సోమాలియా స్కోరు 9 పాయింట్లతో తక్కువగా ఉన్నప్పటికీ, ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. వెనిజులా మరియు సిరియా వరుసగా 10 మరియు 12 పాయింట్లతో వాటి కంటే ముందు ఉన్నాయి.