Ayodhya: అయోధ్య పునాదులు పెకిలిస్తాం.. ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులు

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ.. మరోసారి హెచ్చరికలకు దిగాడు. భారత్‌లోని హిందూ ఆలయాలపై దాడులు చేస్తామని బెదిరించాడు.అయోధ్య రామ మందిరాన్ని పునాదులతో సహా పెకిలిస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు.

Viral Video : ఆ తేదీన ఎయిరిండియా ఫ్లైట్‌ ఎక్కొద్దు.. ఖలిస్థాన్ ఉగ్రవాది వార్నింగ్‌తో టెన్షన్ టెన్షన్..!!
New Update

Ayodhya: సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ అధినేత, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ మరోసారి బెదిరింపు లకు దిగాడు. ఆ బెదిరింపులకు సంబంధించిన వీడియోను విడుదల చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ అయోధ్య రామ మందిరం సహా.. దేశంలోని హిందూ దేవాలయాలపై ఈనెల 16, 17వ తేదీల్లో దాడులు చేయనున్నట్లు తీవ్రమైన హెచ్చరికలు చేశాడు. ఇక అయోధ్యలోని దివ్య రామమందిరాన్ని పునాదులతో సహా పెకిలించి కూల్చేస్తామని పన్నూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

Also Read:  Rains: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు!


 అయోధ్య పునాదులను..

దేశంలోని హిందూ ఆలయాలే లక్ష్యంగా ఈ బెదిరింపులు చేస్తూ.. మరో వీడియోను విడుదల చేశాడు. హింసాత్మక హిందుత్వ భావజాలానికి పుట్టినిల్లు అయిన అయోధ్య పునాదులను పెకిలిస్తామంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఇక ఆ వీడియోలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలను కూడా ప్రదర్శించాడు. నవంబరు 16, 17వ తేదీల్లో ఆలయాలపైన దాడులు జరుగుతాయంటూ గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరికలు జారీ చేశాడు. 

Also Read: Vistara: ముగిసిన విస్తారా కథ..ఈరోజు నుంచి ఎయిర్ ఇండియాలో విలీనం

అంతేకాకుండా ఆలయాలపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడులు చేసేటపుడు దూరంగా ఉండాలంటూ కెనడాలోని హిందువులపైనా బెదిరింపులకు దిగాడు. ఇటీవలె కెనడాలోని బ్రాంప్టన్‌ నగరంలో ఉన్న ఆలయ కాంప్లెక్స్‌లోకి చొరబడిన ఖలిస్థానీ మద్దతుదారులు రెచ్చిపోయారు. అక్కడ ఉన్న హిందూ భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. అయితే అదే బ్రాంప్టన్‌ నగరంలోనే గురుపత్వంత్ సింగ్ పన్నూ తాజాగా వీడియోను రికార్డు చేసి విడుదల చేసినట్లు తెలుస్తోంది.

Also Read: నాకేం తెలియదు..ఆయనే నన్ను ఇరికించారు– హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్

అయితే గురుపత్వంత్ సింగ్ పన్నూ తాజా హెచ్చరికలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇక ఈ వీడియోను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రాజకీయాల్లో ఉగ్రవాదులకు చోటు కల్పిస్తున్నారని కెనడాపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇక ఇప్పటికే గురుపత్వంత్ సింగ్ పన్నూ అనేక బెదిరింపులకు దిగాడు. అంతేకాకుండా ఈ ఏడాది జనవరిలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ సమయంలో కూడా దాడులు చేస్తామని హెచ్చరికలు చేశాడు.

Also Read:  వాయనాడ్‌ను ఉత్తమ పర్యాటక కేంద్రంగా మార్చాలి–ప్రియాంకతో రాహుల్ గాంధీ

కొద్ది రోజుల క్రితమే పన్నూ నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించొద్దంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు జరిగిన సందర్భంగా ఎయిరిండియా విమానాలపై దాడి జరిగే అవకాశాలున్నాయని పన్నూ పేర్కొన్నాడు. మరోవైపు హిందూ దేవాలయాలపై ఖలిస్తాన్ దాడులకు దూరంగా ఉండాలని కెనడాలోని భారతీయులను కూడా పన్నూన్ హెచ్చరించాడు. నవంబర్ 19వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును మూసివేస్తారని.. భవిష్యత్తులో ఆ ఎయిర్‌పోర్టు పేరు కూడా మారుతుందని పేర్కొన్నాడు.

#ayodhya #khalistani-terrorists #Pannun Threatens Attacks On Ayodhya
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe