Us Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు వెనుకంజలో ఉన్న కమలా హారిస్ ఒక్కసారిగా ఫలితాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. స్వింగ్ రాష్ట్రాల్లో అనూహ్య ట్రెండ్స్ వెల్లడవుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు 230 ఓట్లు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌కు 209 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ అంచనాలు మారుతున్నాయి.
Also Read: ఎంగోంగా లిస్ట్ లో ఏకంగా అధ్యక్షుడి సోదరి పోలీస్ అధికారి భార్య
ట్రంప్ ముందంజ అమెరికా ఫలితాల్లో ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్స్ మేరకు ట్రంప్ 20 రాష్ట్రాల్లో గెలవగా, 9 రాష్ట్రాల్లో గెలిచిన హారిస్ మరి కొన్ని రాష్ట్రాల్లో గెలుపుకు దగ్గరగా ఉన్నారు. పోలింగ్ పూర్తయి కౌంటింగ్ కొనసాగుతున్న రాష్ట్రాల్లో ఫలితాలు అంచనాలకు భిన్నంగా ఉన్నాయి.
Also Read: ప్రజాస్వామ్యం కన్నా పైసలే ముఖ్యం.. ట్రంప్ ఆధిక్యంపై ఆసక్తికర సర్వే!
స్వింగ్ రాష్ట్రాల్లో ఫలితాలు మరింత ఆసక్తి కరంగా మారాయి. డొనాల్డ్ ట్రంప్ అలబామా, ఆర్కాన్సాస్, ఫ్లోరిడా,ఇండియానా, కెంటకీ, మిసిసిపి, ఓక్లహోమా, టెన్నెసీ, వెస్ట్ వర్జీనియా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో విజయం సాధించారు. కమలా హ్యారీస్ ఇప్పటికే కనెక్టికట్, డెలవేర్, ఇల్లినోయీ, మసాచుసెట్స్, మేరీల్యాండ్, న్యూజెర్సీ, రోడ్ ఐల్యాండ్, వెర్మాంట్ లో విజయం సాధించి.. మరి కొన్ని రాష్ట్రాల్లో గట్టి పోటీ అయితే ఇచ్చారు.
Also Read: ఇల్లినాయిస్‌లో భారతీయుడు రాజా కృష్ణమూర్తి విజయం!
ట్రంప్ వైపే యువత లేటెస్ట్ ట్రెండ్స్ మేరకు డొనాల్డ్ ట్రంప్ 230ఎలక్టోరల్ ఓట్లు, హారిస్‌కు 210 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. మెజార్టీ రాష్ట్రాల్లో ట్రంప్‌దే ఆధిక్యం గా ఉంది. అయితే, ఇద్దరి మధ్య కొన్ని రాష్ట్రాల్లో హోరా హోరీగా ఓట్లు వస్తుండటంతో.. తుది ఫలితం పైన ఇంకా ఉత్కంఠ మరింత పెరిగిపోతుంది.
Also Read: దూసుకుపోతున్న ట్రంప్.. 17 రాష్ట్రాల్లో ..188 ఎలక్ట్రోరల్ ఓట్లతో!
తాజా అంచనాల మేరకు కమలా హ్యరీస్ మిచిగాన్, పెన్సిల్వినేయాలో విజయం సాధిస్తే అధ్యక్ష రేసులో తుది విజయం కు ఛాన్స్ ఉంటుంది. కానీ, స్వింగ్ స్టేట్స్ లోనూ కొన్ని చోట్ల అంచనాలు తారు మారు అయ్యాయి. మహిళా ఓటింగ్ పెద్ద సంఖ్యలో కమలా హరీస్ కు అనుకూలంగా కనిపించగా.. యూత్ ఓటింగ్ మాత్రం గతం కంటే స్వల్పంగా ట్రంప్ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టంగా తెలుస్తుంది.
మారుతున్న ట్రెండ్స్ తో డెమోక్రట్లకు పట్టు ఉన్న రాష్ట్రాల్లోనూ హోరా హోరీ కనిపించటం ఆశ్చర్యకరంగా మారింది. అధ్యక్షుడిగా గెలవాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు కావాలి. ఇప్పటికే ట్రంప్ కు 230 ఖాయంగా కనిపిస్తుండటంతో.. ఇక, ట్రంప్ విజయం ఖాయమనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో స్వింగ్ రాష్ట్రాల్లో హరీస్ కు మద్దతు అంచనాలకు తగినట్లుగా ఉంది.
దీంతో, కౌంటింగ్ కొనసాగే కొద్దీ వెల్లడయ్యే ట్రెండ్స్ కీలకంగా మారాయి. ప్రస్తుతం కొనసాగుతున్న కౌంటింగ్ సాయంత్రానికి పూర్తయ్యే అవకాశాలున్నాయి. మరి కాపేసట్లో అమెరికా నూతన అధ్యక్షుడి పైన స్పష్టత వచ్చేస్తుంది. అయితే, జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరగనుంది.