ఆ ఊరిలో దాదాపు 60 కుటుంబాలు.. ఎటు చూసినా వృద్ధులే.. యువకులంతా ఉపాది పనుల కోసం ఇల్లు విడిచి వలస వెళ్లిపోయారు. దీంతో దాదాపు 20 ఏళ్ల వరకు ఆ ఊరిలో ఒక్క బిడ్డ కూడా జన్మించలేదు. ఊరి మొదటి నుంచి చివరి వరకు తొలు బొమ్మలే కనిపిస్తాయి. వాటిని చూస్తూ ఆ వృద్ధులు కాలం గడిపేస్తున్నారు. కానీ ఇప్పుడు వారికి ఆ బాధ లేదు. ఆ గ్రామానికి సరికొత్త కళ వచ్చింది.
Also Read : దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి?
20 ఏళ్ల వరకు ఒక్క జననం లేదు
తోలు బొమ్మలతో వారికి పనిలేకుండా పోయింది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఓ సంఘటన ఆ ఊరిలో సరికొత్త ఆనందాన్ని తెచ్చిపెట్టింది. ఇంతకీ ఏం జరిగింది. ఏ కారణంగా ఆ గ్రామానికి ఆ పరిస్థితి వచ్చింది అనే విషయానికొస్తే.. జపాన్‌లోని ఇచినోనో గ్రామంలో మొత్తం 60 కుటుంబాలు. అందులో అత్యధికులు 60 ఏళ్లు పైబడినవారే. ఆ ఊరి యువకులు ఉపాది విద్య కోసం వలస బాట పట్టారు. దీని కారణంగా ఆ గ్రామంలో దాదాపు 20 ఏళ్ల వరకు ఒక్క జననం లేదు. దీంతో అక్కడివారంతా పిల్లలు లేని లోటు పూడ్చేందుకు తోలు బొమ్మలను చూసుకుంటూ కాలం గడిపేవారు.
Also Read : దీపావళి రోజున ఈ మూడు వస్తువులను ఖచ్చితంగా కొనండి
కోవిడ్ కారణంగా సొంతూరుకు
అయితే ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ ఎంతటి ప్రభావం చూపించిందో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో వలస వెళ్లిన యువకులంతా ఊరిబాట పట్టారు. దీంతో ఎంతో కాలం ఫ్యామిలీకి దూరంగా ఉన్న జంటలు ఒక్కటయ్యాయి. ఫలితంగా ఆ ఊరిలో బిడ్డ జన్మించాడు.
Also Read : 'అమరన్' ట్విట్టర్ రివ్యూస్.. చూస్తే షాకవుతారు!
20 ఏళ్ల తర్వాత తొలి బిడ్డ జననం
రీకాటో, తోషికి కటో అనే జంటకు కొడుకు పుట్టాడు. దీంతో ఆ గ్రామంలో సంబురాలు వెన్నంటాయి. 20 ఏళ్ల తర్వాత పుట్టిన తొలిబిడ్డ కావడంతో.. ఊరు ఊరంతా ఆనందంలో మునిగితేలుతున్నారు. తమ సొంత బిడ్డలో ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా చూసుకుంటున్నారు. బొమ్మలు, బట్టలు కొనిస్తున్నారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Also Read : రేవంత్ కుట్రలకు భయపడేది లేదు: KTR
కాగా జపాన్‌లో పెరుగుతున్న జనాభా క్షీణత సంక్షోభం కారణంగా ఇచినోనోలో ఈ దుస్థితి ఏర్పడింది. ప్రపంచంలోనే అత్యధికంగా 65 ఏళ్లు పైబడిన వారు జపాన్‌లోనే ఉన్నారు. రికార్డు స్థాయిలో 36.25 మిలియన్ల మంది 65 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.