Jamaica Floods: జమైకాలో కుంభవృష్టి.. మొత్తం జలమయం.. డేంజర్‌లో వేలాదిమంది ప్రజలు

కరేబియన్ దీవుల్లోని జమైకా దేశంలో కుంభవృష్టి బీభత్సం సృష్టిస్తోంది. ఈ దేశానికి మెలిస్సా హరికేన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ కుండపోత వర్షాల వల్ల ఇప్పటికే నలుగురు మృతి చెందగా.. వేలాది మంది ప్రజలు డేంజర్‌లో ఉన్నారు.

New Update
Jamaica

Jamaica

కరేబియన్ దీవుల్లోని జమైకా దేశంలో కుంభవృష్టి బీభత్సం సృష్టిస్తోంది. ఈ దేశానికి మెలిస్సా హరికేన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల జమైకా దేశం మొత్తం నీటితో నిండిపోయింది. కరేబియన్ దీవుల్లో భారీ ఎత్తున విపత్తులు జరగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ హరికేన్ ముప్పు వల్ల జమైకాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎక్కడ చూసిన నీరే కనిపిస్తుంది. ఈ కుండపోత వర్షాల వల్ల ఇప్పటికే నలుగురు మృతి చెందగా.. వేలాది మంది ప్రజలు డేంజర్‌లో ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మెలిస్సా తుపాన్ ప్రస్తుతం కేటగిరీ 5 తుపాన్‌గా మారిందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో గంటకు 282 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు. 

ఇది కూడా చూడండి: H-1b Visa: హెచ్ 1బీ వీసా ఫీజు ఎఫెక్ట్..డోర్స్ క్లోజ్ చేసిన టెక్ దిగ్గజాలు

ఇది కూడా చూడండి: Pak-Afghan: యుద్ధం అంచున పాక్, ఆఫ్ఘాన్..విఫలమైన టర్కీ శాంతి చర్చలు

Advertisment
తాజా కథనాలు