డబ్బులు, బీర్ కోసం కన్న బిడ్డను అమ్మేసిన దారుణ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. నార్త్ వెస్ట్ అర్కాన్సస్‌కు చెందిన డేరియన్ అర్బన్, షలేన్ ఎహ్లర్ల్స్ జంట తమ మూడు నెలల బిడ్డను బీర్, వెయ్యి డాలర్ల డబ్బు కోసం విక్రయిస్తున్నారు. ఈ బిడ్డను వారు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని ఓ వ్యక్తి అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని తల్లిదండ్రులను పట్టుకున్నారు.
ఇది కూడా చూడండి: వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య
లేఖను స్వాధీనం..
ఆ బిడ్డ శరీరంలో వివిధ భాగాల్లో దద్దుర్లు, బొబ్బలతో బాధపడుతుండటంతో ఆసుపత్రికి తరలించారు. బిడ్డను విక్రయిస్తున్నట్లు రాసిన లేఖను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రులు చిన్నారిని విక్రయిస్తున్నారనే ఆరోపణలతో వారిని అరెస్ట్ చేశారు. ఈక్రమంలో విచారణ చేపట్టగా.. బిడ్డను అమ్మడం లేదని, దత్తత ఇస్తున్నందుకు లేఖ రాసినట్లు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: మంచం కింద డిటోనేటర్లు పేల్చి .. సినిమా లెవెల్‌లో వీఆర్‌ఏ హత్య