హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ దాడి.. మరో హమాస్ కీలక నేత మృతి !

హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్‌ కీలక నేత అల్‌ ఖసమ్ బ్రిగేడ్, సాయుధ విభాగంలో సభ్యుడైన సయీద్‌ అతల్లా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడుల్లో అతల్లాతో పాటు ఆయన ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు తెలుస్తోంది.

Lebanon 3
New Update

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్‌కు చెందిన మరో కీలక నేత, ఆయన కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర లెబనాన్‌లోని ట్రిపోలిలోని పాలస్తీనా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో హమాస్‌ కీలక నేత అల్‌ ఖసమ్ బ్రిగేడ్, సాయుధ విభాగంలో సభ్యుడైన సయీద్‌ అతల్లా మృతి చెందారు. ఈ దాడుల్లో అతల్లాతో పాటు ఆయన ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా మరణించారని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్‌కు చెందిన పలు వార్తా సంస్థలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. 

Also read: భార్యపై 92 రేప్ లు చేయించిన భర్త కేసు.. కోర్టు కీలక నిర్ణయం

ఇదిలాఉండగా.. లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటిదాకా 2 వేల మందికి పైగా మృతి చెందారు. ఇందులో 250 మంది హెజ్‌బొల్లాకు చెందినవారే ఉన్నారు. బీరుట్‌లోని ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా హతమైన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్.. ఇజ్రాయెల్‌పై ప్రతీకారంగా 180 మిసైల్స్‌తో విరుచుకుపడింది. ఇరాన్ తమపై దాడులకు పాల్పడ్డి పెద్ద తప్పు చేసిందని.. కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు.    

#telugu #israel #hezbollah #lebanon
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe