గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు.. 26 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ తాజాగా మరోసారి పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 26 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని పాలస్తీనా వైద్య అధికారులు వెల్లడించారు.

New Update
GAZAA

ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తూనే ఉంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే తాజాగా గాజాపై ఇజ్రాయెల్ మరోసారి పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 26 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని పాలస్తీనా వైద్య అధికారులు వెల్లడించారు.  

Also Read: ఇకనైనా ఆ పని మానుకోండి.. మోదీ ప్రభుత్వంపై రాహుల్‌ ఫైర్

ఇక వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్‌ సరిహద్దులో ఉన్న బీట్‌ లాహియాలో దాడులు జరిగాయి. దీంతో ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే మరికొంతమంది ఆశ్రయం పొందుతున్న ఓ ఇంటిపై కూడా దాడి జరిగింది. దీంతో ఈ ఘటనలో 19 మరణించారు. చనిపోయిన వారిలో ఒకే కుటుంబానికి చెందినవారు 8 మంది ఉన్నారు. ఇదిలాఉండగా.. సెంట్రల్‌ గాజాలోని ఓ శరణార్థి శిబిరంపై కూడా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారలు కూడా ఉన్నారు. మొత్తంగా ఇజ్రాయెల్ చేసిన తాజా దాడుల్లో 26 మంది మృతి చెందారు. తమ శత్రువులు శిబిరాల్లో తలదాచుకుంటున్నారనే కారణంతోనే ఇజ్రాయెల్‌ ఇలా దాడులకు పాల్పడుతోంది.

Also Read: ఇందిరమ్మ ఇళ్లకు 80 లక్షల దరఖాస్తులు.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

ఇదిలాఉండగా.. 2023 అక్టోబర్ 7న హమాస్‌ ఇజ్రాయెల్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ మిలిటెంట్లు 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఏడాదికి పైగా ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల వల్ల ఇప్పటివరకు 44 వేల మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు