/rtv/media/media_files/2025/06/27/maruti-suzuki-e-vitara-and-tata-sierra-ev-2025-06-27-09-51-03.jpg)
Maruti Suzuki e-Vitara and Tata Sierra EV
ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. దేశ వ్యాప్తంగా వాహన ప్రియులు ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కొత్త కొత్త కంపెనీలు మార్కెట్‌లోకి తన కొత్త కొత్త మోడళ్లను పరిచయం చేస్తున్నాయి. కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు వాహనాలను డిజైన్ చేస్తున్నాయి.
Also Read: సైబర్ నేరాలపై సీబీఐ ఉక్కుపాదం.. 700 బ్యాంకుల్లో 8.5 లక్షల మ్యూల్ ఖాతాల గుర్తింపు
ఈ సంవత్సరం మారుతి సుజుకి, టాటా మోటార్స్ కూడా తమ ఎలక్ట్రిక్ SUVలను అధునాతన ఫీచర్లతో తీసుకువస్తున్నాయి. మారుతి సుజుకి మొదటిసారి EV మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇది Maruti Suzuki e-Vitara మోడల్‌ను తీసుకురానుంది. అలాగే టాటా తన సియెర్రా EVని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Tata Sierra EV
టాటా మోటార్స్ ఈ ఏడాది చివరి నాటికి తన కొత్త సియెర్రా EV ని విడుదల చేసే అవకాశం ఉంది. దీన్ని ఇప్పటికే ఆటో ఎక్స్‌పో 2025లో ప్రారంభించారు. భారతదేశంలో ఈ మోడల్‌ను ఎలక్ట్రిక్, పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లలో తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. వీటన్నింటిలో ముందుగా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. దీనికి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 500 కి.మీ కంటే ఎక్కువ మైలేజీ అందిస్తుందని సమాచారం.
ఇందులో DC ఫాస్ట్ ఛార్జింగ్, వెహికల్-టు-లోడ్ (V2L), వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి లైఫ్ టైమ్ బ్యాటరీ వారంటీ కూడా అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని బ్లాక్-అవుట్ రూఫ్, సన్‌రూఫ్, డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది 5 మందికి కూర్చునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని ధర రూ. 20 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
Also Read: టోల్ ట్యాక్స్ కట్టాలని అడిగినందుకు.. తుపాకీతో కాల్పులు
Maruti Suzuki e-Vitara
మారుతి సుజుకి త్వరలో తన తొలి ఎలక్ట్రిక్ SUV E-Vitaraను లాంచ్ చేయనుంది. ఈ ఏడాది సంక్రాంతి నాటికి దీనిని లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది 5 సీట్ల ఎలక్ట్రిక్ SUV. ఈ మోడల్ 48.8 kWh, 61.1 kWh రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో వస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పై 450 కి.మీ నుండి 500 కి.మీ వరకు మైలేజ్‌ని అందిస్తుంది. ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ADAS, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 360 -డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు అందించారు. దీని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 17.99 లక్షల నుండి ప్రారంభమవుతుందని సమాచారం.