/rtv/media/media_files/2026/02/28/fotojet-13-2026-02-28-17-06-37.jpg)
Iran's Chief of Armed Staff General Mohammad Bagheri was killed
Iranian army chief : ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య నెలకొన్న యుద్ధం మరింత ముదిరింది. ఇజ్రాయెల్ చేసిన మెరుపుదాడులతో ఇరాన్‌లోని పలు సైనిక స్థావరాలు నేలమట్టం అయ్యాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్ అణు కేంద్రం, సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసింది. ఇజ్రాయేల్ దాడిలో ఇరాన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ చీఫ్ ముహమూర్ బగేరీ, రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హొస్సేనీ సలామీ ప్రాణాలు కోల్పోయారు.
దీంతో ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోయింది. అమెరికా సైనిక స్థావరాలున్న ఎనిమిది దేశాలపై ఏకకాలంలో దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా ఎయిర్‌బేస్‌లపై ఇరాన్ అటాక్ చేసింది. అబుదాబి ఎయిర్‌బేస్ పై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందారు. యూఏఈ, సౌదీ, బహ్రెయిన్‌లలోనూ ఇరాన్ భారీ పేలుళ్లకు తెగబడింది. టెహ్రాన్‌లోని చర్చికి సమీపంలో ఇజ్రాయెల్ మిస్సైల్ అటాక్ చేసింది.
మరోవైపు ఇరాన్ అణు ఆయుధాల ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకుని విస్తృతమైన దాడులను చేపట్టినట్లు ఇజ్రాయేల్ రక్షణ దళాలు (IDF) ప్రకటించాయి. ఈ దాడుల్లో SPND అణు ప్రాజెక్ట్ ప్రధాన కేంద్రం, టెహ్రాన్‌లోని ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, అలాగే ఇరాన్ అణ్వాయుధాలను దాచి ఉంచిన ప్రదేశాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు IDF ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
Follow Us