Iran: నిరసనకారులకు మత్తు ఇంజెక్షన్లు..బయటపడుతున్న ఇరాన్ దారుణాలు

ఇరాన్ లో ఆందోళనల్లో వేలది మంది నిరసనకారులను అక్కడి ప్రభుత్వం నిర్భందించింది. వీరిలో వందల మందికి మరణశిక్షకు కూడా సిద్ధమైంది. అయితే అమెరికా జోక్యంతో దానిని విమరమించుకుంది. కానీ ప్రస్తుతం జైళ్ళల్లో ఉన్నవారి పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తోందని తెలుస్తోంది.

New Update
protesters

ఇరాన్ లో వారం కొన్ని రోజుల క్రితం భారీ ఆందోళనలు జరిగాయి. అక్కడి పాలను నిరసనగా వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. వీటిని అణిచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులను అరెస్ట్ చేసింది. వేలల్లో ప్రజలను నిర్భంధించింది. వారందరికీ మరణశిక్ష విధించేందుకు కూడా సిద్ధమైంది. అయితే అమెరికా జోక్యంతో దానిని విరమించుకుంది. మరోవైపు ఇరాన్‌ ఆందోళనల్లో 500 మంది భద్రతా సిబ్బంది సహా ఐదు వేల మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. ఇవన్నీ అధికారులు ధృవీకరించిన మరణాలే. ఇవి కాకుండా చాలా మంది మృతి చెందారని తెలుస్తోంది. 

గుర్తు తెలియని ఇంజెక్షన్లు..

ఆందోళన చేస్తున్న వేలాది మంది నిరసనకారులను ఇరాన్ ప్రభుత్వం కస్టడీలోకి తీసుకుంది. అలా పట్టుకున్న వారందరికీ కఠిన శిక్షలు తప్పవని కూడా చెప్పింది. అందుకు తగ్గట్టే ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. వేల్లో నిరసనకారులు  వారందరూ ప్రస్తుతం అక్కడ జైళ్ళల్లో మగ్గుతున్నారు. వీరికి మరణశిక్షలను విధించడం ఆపేసినా..నిర్భంధ కేంద్రాల్లో మాత్రం దారుణంగా ప్రవర్తిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి బ్రిటన్ మీడియాలో కథనాలు వచ్చాయి.  జైలు ప్రాంగణంలో బందీలను నగ్నంగా నిలబెట్టి వారిపై పైపులతో చల్లని నీటిని చల్లుతున్నట్లు బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇది చాలా చిన్న చిన్నది అని...బందీలకు ఏవో గుర్తు తెలియని ఇంజెక్షన్లను ఇస్తున్నారని..వేటి కోసం ఇవి ఇస్తున్నారో కూడా తెలియడం లేదని బ్రాటన్ మీడియా చెబుతోంది. కానీ ఆ ఇంజెక్షన్లు వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని చెబుతున్నారు.

ఇక ఆడవారి విషయంలో అయితే మరీ అమానుషంగా ప్రవర్తిస్తున్నారని తెలుస్తోంది. వారిని తరలించే సమయంలోనే అసభ్యంగా ప్రవర్తించారని కుర్దిష్‌ మానవ హక్కుల సంస్థ ఇటీవల ఆరోపించింది. మరోవైపు విదేశీ శక్తులకు అనుకూలంగా పనిచేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని, కేసులు ఎదుర్కోవాల్సిందేనని ఇరాన్ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ చెబుతోంది.

Advertisment
తాజా కథనాలు