Iran nuclear facilities: అంతా తూచ్.. ట్రంప్‌ని పిచ్చోడిని చేసిన ఇరాన్

గత 3 రోజుల క్రితం నంతాజ్, ఫోర్డో, ఇస్ఫాహాన్ అణు కేంద్రాలపై చేసిన దాడులు విజయవంతం అయ్యాయని ట్రంప్ వెల్లడించారు. తీరా చూస్తే అక్కడ పెద్దగా నష్టం జరగలేదని US ఇంటెలిజెన్స్ తెలిపింది. దాడులకు ముందే ఇరాన్ 400 కేజీల యురేనియంను రహస్య ప్రదేశాలకు తరలించిదట.

New Update
Iran’s nuclear facilities

ఇరాన్ అమెరికాను మోసం చేసింది. ట్రంప్ బొక్కబోర్లా పడ్డాడు. ఇరాన్ న్యూక్లిర్ సైట్లపై దాడి చేసి వాటిని ధ్వంస చేశామని అమెరికా చెప్పుకుంది. గత మూడు రోజుల క్రితం నంతాజ్, ఫోర్డో, ఇస్ఫాహాన్ అణు కేంద్రాలపై చేసిన దాడులు విజయవంతం అయ్యాయని ట్రంప్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ వెల్లడించారు. తీరా చూస్తే అక్కడ పెద్దగా నష్టం జరగలేదని US ఇంటెలిజెన్స్ తెలిపింది. దాడులకు ముందే ఇరాన్ 400 కేజీల యురేనియంను రహస్య ప్రదేశాలకు తరలించిదట. దీంతో 10 అణు బాంబులు తయారు చేసే అవకాశం ఉంది.

ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ముగియగానే ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధి ప్రారంభించనట్లు ప్రకటించింది. అమెరికా మాటలను పెడచెవిన పెట్టి న్యూక్లియర్ ప్రోగ్రామ్ తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ట్రంప్ వార్నింగ్‌ను ఇరాన్ ఏమాత్రం పట్టించుకోలేదు. అమెరికా దాడుల్లో ఇరాన్ న్యూక్లియర్ సైట్లు పూర్తిగా నాశనం కాలేదని US ఇంటెలిజెన్స్ వెల్లడించింది. దానికి బంధించిన శాటిలైట్‌ చిత్రాలను US ఇంటెలిజెన్స్ అధికారులు విడుదల చేశారు. రిపోర్ట్‌ లీక్‌ కావడంపై వైట్ హౌస్ తీవ్రంగా స్పందించింది. ట్రంప్‌ను కించపరిచే ఉద్దేశంతోనే తప్పుడు రిపోర్ట్ లీక్ -చేస్తున్నారని వైట్ హౌస్‌ చెప్పుకొచ్చింది.

Advertisment
తాజా కథనాలు