గత కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అణుయుద్ధం దిశగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్ అత్యంత రహస్యంగా అణు పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సెమ్‌నాన్ అనే ప్రాంతంలో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అణు పరీక్షల వల్లే భూకంపం వచ్చినట్లు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అండర్‌గ్రౌండ్‌లోనే ఇరాన్ అణు పరీక్షలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also read: మరోసారి విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..19 మంది పాలస్తీనియన్లు మృతి!
ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరాన్‌ను హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరాన్ అణు పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. 2019 నుంచే ఇరాన్.. అండర్ గ్రౌండ్ టెస్టింగ్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ రహస్య ప్రాంతంలోకి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ వెళ్లినట్లు సమాచారం. ఇరాన్ అణు పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. ఇరాన్ అణు కేంద్ర, ఆయిల్ నిల్వల కేంద్రాలపై ఇజ్రాయెల్ సైబర్ అటాక్ చేసింది. దీంతో ఇరాన్ గ్యాస్, ఆయిల్ కేంద్రాలు స్తంభించిపోయాయి.