Israel : ఇజ్రాయెల్ తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ అన్ని విమానాలను రద్దు చేసింది. ఇరాన్ కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ నిర్ణయం అమలులోఉండనుంది. లెబనాన్ సైతం ఇదే నిర్ణయం తీసుకుంది.
Also Read: పెరిగిపోతున్న టమాటా ధరలు..15 రోజుల్లోనే ధరలు ట్రిపుల్!
రాజధాని బీరూట్ నుంచి అన్ని విమానాలను రద్దు చేసింది. ఇజ్రాయెల్ ఏ సమయాన దాడి చేస్తోందో అన్న ఊహాగానాల నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: రుణమాఫీపై ప్రధాని మోదీ Vs సీఎం రేవంత్
ఇటీవల ఇరాన్ 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. దీంతో ఇరాన్ పెద్ద తప్పుచేసిందని మూల్యం చెల్లించుకుంటుందని ప్రతీకార దాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్న సంగతి తెలిసిందే. దానికి తోడు గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ భీకర దాడి చేసి 1200 మందిని హతమార్చి నేటికి ఏడాది.
Also Read: తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు..!
ఈ రెండు సంఘటనల నేపథ్యంలో ఏ క్షణమైనా ఇజ్రాయెల్ తమ దేశం పైకి దాడికి దిగవచ్చిన , ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Also Read: తొలి టీ20లో భారత్ ఘన విజయం!