/rtv/media/media_files/2025/05/16/TicP78bHlO7g06z4D1ej.jpg)
Mountain climbing
Mountain climbing : అమెరికాలో పర్వతారోహణకు వెళ్లిన ఓ బృందానికి ప్రమాదం ఎదురైంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఇందులో భారత సంతతికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీరు ఇరిగిరెడ్డి విష్ణు కూడా ఉన్నాడు. వివరాల్లోకి వెళ్తే...వాషింగ్టన్ రాష్ట్రంలోని నార్త్ క్యాస్కేడ్స్ పర్వతాలను అధిరోహించడానికి ఓ బృందం వెళ్లింది. వారిలో సియాటెల్ లో నివసించే ఇరిగిరెడ్డి విష్ణు తన మిత్రులైన టిమ్ గుయేన్, ఒలెక్సాండర్ మార్టినెంకో, ఆంటోన్ త్సెలిక్‌లు ఉన్నారు.
Also Read: అణు బెదిరింపులకు లొంగేది లేదు.. తేల్చి చెప్పిన రాజ్‌నాథ్ సింగ్
విష్ణు మరో ముగ్గురితో కలిసి గత శనివారం క్యాస్కేడ్స్‌లోని నార్త్ ఎర్లీ వింటర్స్ స్పైర్ ప్రాంతాన్ని అధిరోహించేందుకు వెళ్లారు. పర్వాతాలను ఆధిరోహించిన బృందం తిరుగు ప్రయాణంలో మంచు తుఫానుకు గురైంది. దిగే క్రమంలో ప్రతికూల వాతావరణం ఏర్పడంతో ఆ బృందం యాంకర్ పాయింట్ విఫలమై.. 200 అడుగుల లోతులో పడిపోయారు. అయితే బృందం సభ్యులందరూ ప్రమాదానికి గురి కావడంతో విషయం ఎవరికీ తెలియలేదు.
Also Read : హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!
వీరిలో ఆంటోన్ త్సెలిక్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన దాదాపు 64 కి.మీ. ప్రయాణించి.. జరిగిన ప్రమాదంపై అధికారులకు సమాచారం అందించాడు. భారత్‌కు చెందిన ఇరిగిరెడ్డి విష్ణు సియాటెల్‌లో టెక్, సాంస్కృతిక సమాజంలో పనిచేస్తున్నాడు. ఆయనకు పర్వతారోహణ పట్ల ఆసక్తి ఎక్కువ. ప్రస్తుతం ఆయన గ్రేటర్ సియాటెల్‌లోని టెక్ సంస్థ ఫ్లూక్ కార్పొరేషన్‌లో ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేస్తున్నారు. విష్ణుకు పర్వతారోహణ పట్ల ఆసక్తి ఉండటంతో తన స్నేహితులతో కలిసి వెళ్లి అనుకోని ప్రమాదానికి గురి కావడం పట్ల ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేశారు.
Also Read: అబ్బాయిలంటే అలెర్జీ.. పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. వైరల్ వీడియో!