Indian Deiplomats In Persons Of Interest:
కెనడా ఓటు బ్యాంకు రాజకీయాలతో రోజురోజుకూ దిగజారిపోతోందని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా మండిపడింది. కెనెడియన్ గడ్డపై వేర్పాటు వాద అంశాలను పరిష్కరించడానికి చేయవలసిన పనులు చేయకుండా ఏమేమో చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పదేపదే అభ్యర్ధలు చేసినప్పటికీ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ ఆరోపణలూ చేస్తూనే ఉందని అంటోంది భారత ప్రభుత్వం. కానీ ఎన్నిసార్లు అడిగినా సరైన సాక్ష్యం ఒక్కటి కూడా చూపించలేకపోయారని విమర్శించింది.
Also Read: అదానీ ప్రాజెక్టుపై శ్రీలంక ప్రభుత్వం పున:పరిశీలన
అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త పేరు..
తాజాగా నిజ్జర్ హత్య కేసులో (Nijjar Murder Case) అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ (Sanjay Verma) పేరును చేర్చింది కెనడా ప్రభుత్వం. పర్శన్ ఆఫ్ ఇంట్రస్ట్ అనే జాబితాను తయారు చేసి... కెనడా నుంచి మన విదేశాంగ శాఖకు సమాచారం అందించింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కెనడా చర్యలు పూర్తిగా అసంబద్ధమని మండిపడింది. ఓటు బ్యాంక్ రాజకీయాలతో నడిచే ట్రూడో సర్కారు అజెండాకు అనుకూలంగా ఉన్నాయని మండిపడింది. రాజకీయ లబ్ధి కోసం ఎటువంటి ఆధారాలు లేకుండా భారత మీద విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడా ప్రధాని 2018 నుంచి భారత్‌తో ఎలాగో ఒకలా తగవులు పెట్టుకోవడానికే చూస్తున్నారని..అందుకు తగ్గట్టుగానే వేర్పాటువాదాన్ని ఎగదోసే వారిని తన మంత్రివర్గంలో చేర్చుకున్నారని ఆరోపించింది. భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మకు 36ఏళ దౌత్య అనుభవం ఉందని విదేశాంగశాఖ తెలిపింది. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలపై అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేంతరవకూ..ఇఉ దేశాల మధ్యా పరిస్థితులు సరి అవవని విదేశాంగ శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది.
Also Read: Arjun-Pawan Kalyan:అల్లు అర్జున్ పేరెత్తిన పవన్.. ఏమన్నాడో తెలుసా?
ఎప్పుడూ అదే మాట..
ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య(Suicide) వెనుక భారత ఏజెండ్ల హస్తముందని కెనడా ప్రధాని జస్టీన్ ట్రూడో(Justin Trudeau) గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి ఇరుదేశాల మధ్య దౌత్యపరంగా విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ కేసు దర్యాప్తుపై కొద్దిరోజుల క్రిం స్పందించిన ట్రూడో మళ్లీ భారత్‌పై నోరుపారేసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటున్నామని.. కానీ ఈ కేసులో భారత ప్రభుత్వ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమని అన్నారు. కెనడలో మన పౌరుడిపై హత్య జరిగింది. ఇది చాలా తీవ్రమైన అంశం. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని విశ్వసనీయ ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని మేను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. విదేశీ ప్రభుత్వాల చట్టవిరుద్ధమైన చర్యల నుంచి కెనడా పౌరులను రక్షించే బాధ్యత మాపై ఉంది. ఇందుకోసమే ఈ అంశాన్ని మేము సీరియస్‌గా తీసుకున్నామంటూ' ట్రూడో వ్యాఖ్యానించారు.
Also Read: TS: రేవంత్ సర్కార్ కు హైకోర్టు బిగ్ షాక్.. మూసీ కూల్చివేతలపై స్టే!
కెనడా–భారత్ వివాదం..
గత ఏడాది జూన్ ఖలిస్థానీ ఉగ్రవాది(Terrorist) నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని.. ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరుదేశాల మధ్య దౌత్య వివాదం మొదలైంది. ఆయన చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని.. వాటిని పరిశీలించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకుంటామని భారత్ కెనడాకు చాలాసార్లు చెప్పింది.
Also Read: Jani Master: జానీ మాస్టర్ కు బిగ్ షాక్.. ఆ పిటిషన్ డిస్మిస్!