India-Bangla: బంగ్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు..ఢాకాలో వీసా కేంద్రాన్ని మూసివేసిన ఇండియా

బంగ్లాదేశ్ కు సంబంధించి భాత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ రాజధాని ఢాకాలో వీసా దరఖాస్తు కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. బంగ్లా నేతల బెదిరింపు నేపథ్యంలో..భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపింది. 

New Update
visa center

కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ భారత్ ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. పక్క దేశం పాకిస్తాన్ తో కలిసి బంగ్లాదేశ్ కుట్రలు చేస్తోంది. భారత్ సరిహద్దులను ఆక్రమించుకోవడానికి రెండు దేశాలు ప్లాన్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్, భారత్ ల మధ్య ఉద్రిక్తతలు చెలరేగడంతో అక్కడి ఢాకాలోని వీసా కేంద్రాన్ని మూసివేస్తున్నట్టు భారత్ ప్రకటించింది. ఆదేశ నేతల బెదిరింపు వ్యాఖ్యల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అపాయింట్‌మెంట్స్ ఉన్నవారికి కొత్త తేదీ కేటాయించబడుతుందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి బంగ్లాదేశ్ హై కమిషనర్‌తో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మాట్లాడింది. భారత రాయబార కార్యాలయం భద్రతపై తన ఆందోళనను వ్యక్తం చేసింది. బంగ్లాలో వీసా కేంద్రాలను మూసివేయడం ఇదేమీ మొదటి సారి కాదు. అంతకు ముందు లాస్ట్ ఇయర్ ఆగస్టులో హింస చెలరేగినప్పుడు కూడా కొన్ని రోజుల పాటూ భారత తన వీసా కేంద్రాలను క్లోజ్ చేసింది. 

పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు..

బంగ్లాలో ప్రస్తుతం ఉన్న తాత్కాలిక యూనస్ ప్రభుత్వం భారత్ పై మొదటి నుంచీ వ్యతిరేక వ్యాఖ్యలను చేస్తూనే ఉంది. పాకిస్తాన్, చైనాలతో కలిసి ఈశాన్య ప్రాంతాల గురించి ప్రకటన చేస్తూ ఇబ్బందులు సృష్టిస్తోంది. ప్రతీసారీ బంగ్లాదేశ్ భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్నట్టు ప్రవర్తిస్తోంది. తాజాగా భారతదేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా బంగ్లాదేశ్‌కు చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ నేత హస్నత్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఆశాన్య రాష్ట్రాలైన సెవెన్ సిస్టర్స్ ను భారత్ నుంచి వేరు చేస్తామని హస్నత్ అనడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. అలాగే మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించడం పట్లా ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడారు. భారత్ ఇలానే ప్రవర్తిస్తే ఆ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వేర్పాటువాద శక్తులకు ఆశ్రయం కల్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బంగ్లాదేశ్ లో అస్థిరత ఏర్పడితే.. అది భారత్ కూ వ్యాపిస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా తమపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోందని అబ్దుల్లా ఆరోపించారు. 

హస్నత్ అబ్దుల్లా రెచ్చగొట్టే ప్రసంగాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సీరియస్ గా తీసుకుంది. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు పొరుగు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీస్తాయని దౌత్యవేత్తలు అభిప్రాయపడ్డారు. అస్థిరత సృష్టించే శక్తులకు చోటు కల్పిస్తున్నారని..బాధ్యతాయుతంగా వ్యవహరించాలని భారత్ ఆ దేశ దౌత్యవేత్తలను హెచ్చరించింది. దాంతో పాటూ అక్కడ ఎన్నికలు జరిగే వరకూ ఆ దేశ రాజధాని ఢాకాలోని వీసా కేంద్రాన్ని మూసి వేయాలని నిర్ణయించింది. 

Advertisment
తాజా కథనాలు