IND vs PAK : అసిమ్ సిగ్గు తెచ్చుకో.. పాక్కు భారీ సహాయం చేసిన భారత్!

భారత్ పెద్ద మనసును చేసుకుని పాకిస్తాన్‌కు  భారీ సహాయం చేసింది. వరదల గురించి పాకిస్తాన్ అధికారులకు కీలక సమాచారాన్ని అందించింది.  తావి నదిలో తీవ్రమైన వరదలు సంభవిస్తాయని హెచ్చరించింది.

New Update
ind vs pak

ఈ ఏడాది ఏప్రిల్ 22న కశ్మీర్‌లోని పహల్గామ్ లోయలో ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో పాపం అమాయకపు 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ ఘటన తరువాత కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌పై కఠినమైన చర్యలు తీసుకుంది.  పాక్‌ తో అన్ని సంబంధాలను తెంచుకుంది. అందులో సింధూ జల ఒప్పందాన్ని రద్దు చేయడం, వీసాలను నిలిపివేయడం,  వాఘా- అట్టారి సరిహద్దును మూసివేయడం వంటివి ఉన్నాయి.  ఈ నిర్ణయాల తరువాత భారత సైన్యం పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించింది. ఈ వైమానిక దాడిలో, పాకిస్తాన్, పిఓకెలో ఉన్న 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించగా, 10 కి పైగా ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. దీని తరువాత, రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా క్షీణించాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ మొదటిసారిగా పాకిస్తాన్‌కు భారీ సహాయాన్ని అందించింది. 

వరదలు బీభత్సం

ప్రస్తుతం పాక్ తో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రుతుపవనాలు ప్రారంభమైన జూన్ చివరి నుండి ఇప్పటివరకు పాకిస్తాన్‌లో 785 మందికి పైగా మరణించారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) తెలిపింది. ముఖ్యంగా గత కొన్ని వారాలుగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్క బునర్ జిల్లాలోనే దాదాపు 300 మందికి పైగా చనిపోయారు. ఇంకా 150 మంది వరకు గల్లంతయ్యారని అధికారులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ మరియు ఇతర రెస్క్యూ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీరు, ఇతర అవసరమైన వస్తువులను పంపిణీ చేస్తున్నారు. అయితే, చాలా ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా ఉంది. 

భారత్ భారీ సహాయం

 ఈ క్రమంలో భారత్ పెద్ద మనసును చేసుకుని పాకిస్తాన్‌కు  భారీ సహాయం చేసింది. వరదల గురించి పాకిస్తాన్ అధికారులకు కీలక సమాచారాన్ని అందించింది.  తావి నదిలో తీవ్రమైన వరదలు సంభవిస్తాయని హెచ్చరించింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ఆగస్టు 24న ఈ సమాచారాన్ని పాక్ అధికారులకు అందించింది. దీని ఆధారంగా పాకిస్తాన్ అధికారులు తమ ప్రజలకు వరద హెచ్చరిక జారీ చేశారు. వరదల ప్రమాదాల గురించి వివరణాత్మక సమాచారాన్ని వారితో పంచుకుంది. అంతకుముందు ఇలాంటి సమాచారాన్ని సింధూ నది జలాల ఒప్పంద కమిషనర్‌ పంచుకునేవారు. తావి నది జమ్మూ నుండి పాకిస్తాన్ పంజాబ్‌లోకి ప్రవేశిస్తుంది. భారీ వర్షాల కారణంగా పాకిస్తాన్‌లో గత 24 గంటల్లో, పంజాబ్ రాష్ట్రంలో 20 వేలకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  కాగా ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండు దేశాల అధికారుల మధ్య సంబంధాలు ఏర్పడటం ఇదే మొదటిసారి. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్,  మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో భారత్ ను అణు బాంబు దాడులతో బెదిరిస్తూనే ఉన్నప్పటికీ భారత్ ఇలాంటి సహాయం చేయడం గమనార్హం.  

Also Read : Ganesh Chaturthi 2025: ఎల్లుండే వినాయక చవితి.. మీ ఇంట్లో ఈ 3 పనులు ఇప్పుడే ప్రారంభించండి!

Advertisment
తాజా కథనాలు