/rtv/media/media_files/2025/05/04/TkSNZsUnsk1H6G7jE2wv.jpg)
IMF India Executive Director KV Subramanian post removed the government
KV Subramaniam: భారత్, పాకిస్థాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. IMF ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవీ సుబ్రమణ్యంను పదవి నుంచి తొలగించింది. నవంబర్‌తో ఆయన పదవి ముగియనుండగా 6 నెలలకు ముందే తప్పించింది. కారణాలు తెలియాల్సివుంది.
ఎందుకు తొలిగించారు..
ఈ మేరకు ఏప్రిల్ 30న ఆయనను ఈ పదవి నుంచి తొలగించినట్లు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కేబినెట్ కమిటీ ఆన్ అపాయింట్‌మెంట్ ఇటీవల న్యూఢిల్లీలో సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంను ఆ పదవి నుంచి ఎందుకు తొలిగించిందనే విషయాన్ని మాత్రం కేంద్రం వెల్లడించక పోవడం గమనార్హం.
డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యం..
సుబ్రమణ్యం భారత ప్రభుత్వానికి 17వ ప్రధాన ఆర్థిక సలహాదారు. అంతేకాదు ఈ బాధ్యతను చేపట్టిన అతి పిన్న వయస్కుడు కూడా. ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. ఐఐఎం కలకత్తా నుండి ఎంబీఏ పట్టా పొందారు. ఆయన చికాగో విశ్వవిద్యాలయంలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఆర్థిక ఆర్థిక శాస్త్రంలో పిహెచ్‌డి పట్టా పొందారు. ఇక సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వివిధ నిపుణుల కమిటీలలో పదవులు నిర్వహించారు.
telugu-news | modi