/rtv/media/media_files/2024/11/11/iES8slBuSIlKyGPZrxnB.jpg)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం అందుకున్న డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో అధికారాన్ని చేపట్టబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే ...వాటి పై 100 శాతం ట్యాక్స్ విధిస్తామని హెచ్చరించారు. బ్రిక్స్ సదస్సులో ఉమ్మడి కరెన్సీ పై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Also Read: Fengal Cyclone: తీరం దాటేసిన 'ఫెంగల్'.. ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త!
డాలర్ కు దూరంగా..
దీంతో ట్రంప్ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. బ్రిక్స్ సభ్య దేశాలు అమెరికా డాలర్ కు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాయి. బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందించకూడదు. శక్తిమంతమైన అమెరికా డాలర్ కు బదులు మరో కరెన్సీని తీసుకురాకూడదు. అలా చేస్తే ఆయా దేశాలద దిగుమతుల పై 100 శాతం సుంకం విధిస్తాం.
Also Read: ట్రంప్ హయాంలో కశ్యప్ పటేల్‌కి కీలక బాధ్యతలు.. ఎవరతను?
దీంతోపాటు ఆయా దేశాలు అమెరికాతో వాణిజ్యాన్ని వదులుకోవాల్సి ఉంటుందని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. అక్టోబర్ లో రష్యాలోని కజాన్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బ్రిక్స్ దేశాలు ఉమ్మడిగా,కరెన్సీ రూపొందించడం పై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పిలుపునిచ్చారు.
Also Read: BIG BREAKING: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు..
బ్రిక్స్ 10 దేశాలకు ఉమ్మడి కరెన్సీ తీసుకుని వచ్చేందుకు సమయం ఇంకా ఆసన్నం కాలేదు. దానిపై నెమ్మదిగా అడుగులు వేస్తాం. లేదంటే ఐరోపా సమాఖ్యకు ఎదురైన సమస్యలకంటే పెద్దవి ఎదురవుతాయి. ప్రస్తుతం కూటమిలోని దేశాలు డిజిటల్ కరెన్సీ వాడుకునేందుకు భారత్ తో కలిసి రష్యా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Private Bus: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
సభ్యదేశాలు కొత్త ఆర్థిక సాధనాలను వినియోగించుకోవాలి. దీని పై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నాం. సెంట్రల్ బ్యాంకులతో ఆయా దేశాలకు సంబంధాలు ఏర్పడాలి. డాలరు వాడడం సరైనదేనా అనే ఆలోచనలో యావత్ ప్రపంచం ఉంది. అందుకే చెల్లింపుల్లో ,రిజర్వుల్లో దాని పరిమాణం తగ్గుతోంది. అమెరికా మిత్ర దేశాలూ డాలర్ నిల్వల్ని తగ్గించుకుంటున్నాయి అని పుతిన్ పేర్కొన్నారు.