Donald Trump: వారికి మరణ శిక్ష విధిస్తా!

ఫెడరల్‌ మరణిశిక్షను ఎదుర్కొంటున్న 40 మంది ఖైదీల్లో 37 మందికి శిక్షను జో బైడెన్‌ తగ్గించిన విషయం తెలిసిందే. ఈ చర్యను కాబోయే అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఖండించారు. తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ విషయంపై కఠిన నిర్ణయం తీసుకుంటానన్నారు.

New Update
D Trump

d trump

మరికొన్ని రోజుల్లో అధ్యక్ష బాధ్యతలనుంచి వైదొలగనున్న జో బైడెన్‌ ఫెడరల్‌ మరణిశిక్షను ఎదుర్కొంటున్న 40 మంది ఖైదీల్లో 37 మందికి శిక్ష తగ్గించిన విషయం తెలిసిందే. ఈ చర్యను కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఖండించారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌ సోషల్‌ వేదికగా సంచలన పోస్ట్‌ చేశారు.

Also Read: ఏపీలో ఘోర విషాదం! కొడుకు హిజ్రాను ప్రేమించాడని.. పేరెంట్స్ ఏం చేశారంటే

జో బైడెన్‌ దేశంలోని 37 మంది హంతకులకు మరణశిక్షను తగ్గించారు.నేను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే రేపిస్టులు, హంతకులకు మరణశిక్ష అమలు చేయాలని న్యాయశాఖను ఆదేశిస్తా. ఈ చర్య అమెరికన్‌ ప్రజలను రక్షిస్తుంది. దేశంలో మళ్లీ శాంతిభద్రతలు పునరుద్దరిస్తా అని పేర్కొన్నారు.

Also Read: TG News: కలెక్టర్‌కు గోడు చెప్పుకునేందుకు గురుకుల విద్యార్థుల సాహసం

మరణశిక్షలకు సంబంధించి అమెరికాలో ఆయా రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రమే వీటిని అమలు చేస్తున్నాయి. తోటి ఖైదీలను హతమార్చిన వారు , బ్యాంకు దోపిడీల సమయంలో హత్యలకు పాల్పడిన వారికి వీటిని అమలు చేస్తోంది. ఇలా 1988 నుంచి 2021 వరకు మొత్తంగా 79 మందికి ఈ శిక్ష పడినప్పటికీ..అత్యంత అరుదుగా వీటి అమలు కొనసాగుతోంది.

Also Read: PV Sindhu: వేడుకగా పీవీ సింధు వెడ్డింగ్‌ రిసెప్షన్‌...హాజరైన ప్రముఖులు వీరే!

మొత్తంగా ఇప్పటి వరకు 16 మందికి మాత్రమే శిక్ష అమలు చేశారు.2003 నుంచి ట్రంప్‌ మొదటి సారి అధికారంలోకి వచ్చే వరకు ఫెడరల్‌ ఖైదీలకు మరణశిక్ష అమలు చేయలేదు.కానీ ఆయన అధికారం చేపట్టిన తొలి ఆరు నెలల్లోనే 13 మందికి శిక్ష అమలు చేయడం గమనార్హం.చివరిగా జనవరి 16, 2021 న శిక్ష అమలయ్యింది.

Also Read: High Court: అత్యాచార బాధితులపై ఢిల్లీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు

ప్రస్తుతం 40 మంది ఈ జాబితాలో కొనసాగుతుండగా..వీరిలో 37 మందికి తాజాగా జో బైడెన్‌ క్షమాభిక్ష కల్పించారు. బోస్టన్‌ మారథాన్‌ బాంబుదాడి కేసులో ఉన్న దోషితో సహా ముగ్గురికి ఉపశమనం దక్కలేదు. ఇదిలా ఉంటే అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలు మరణశిక్షను పూర్తిగా రద్దు చేయగా..ఆరు రాష్ట్రాలు వీటిని తాత్కాలికంగా నిలిపివేశాయి. మొత్తంగా 2024 లోనే దేశవ్యాప్తంగా 25 మరణశిక్షలు అమలు చేసినట్లు నివేశికలు చెబుతున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు