బంగ్లాదేశ్‌లో మరోసారి దారుణం.. పూజ చేసుకుంటున్న హిందువులపై బాంబు దాడి

బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుసగా దాడులు జరగడం కలకలం రేపుతోంది. తాజాగా అక్కడ మరో దారుణం చోటుచేసుకుంది. శనివారం కోమిల్లా ప్రాంతంలోని పూజలు చేసుకుంటున్న హిందువులపై గుర్తుతెలియని కొందరు దుండగులు బాంబులు విసిరేశారు.

New Update
Hindus Attacked Again In Bangladesh

Hindus Attacked Again In Bangladesh

బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుసగా దాడులు జరగడం కలకలం రేపుతోంది. తాజాగా అక్కడ మరో దారుణం చోటుచేసుకుంది. శనివారం కోమిల్లా ప్రాంతంలోని పూజలు చేసుకుంటున్న హిందువులపై గుర్తుతెలియని కొందరు దుండగులు బాంబులు విసిరేశారు. మంటలు చెరగేడంతో అక్కడున్న హిందువులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో పూజా కార్యక్రమానికి హాజరైన వాళ్లలో పలువురు గాయపడ్డారు. 

Also Read: క్యాన్సర్‌ను జయించి UPSCలో సత్తా చాటిన సంజయ్.. సక్సెస్ స్టోరీ వింటే గూస్‌బంప్సే!

కేశవ్ చక్రవర్తి అనే పూజారి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా ఇటీవల బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీని హత్య చేసిన సంగతి తెలసిందే. దీంతో అప్పటినుంచి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా హిందువులపై దాడులు పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో పదుల సంఖ్యలో హిందువులు ప్రాణాలు కోల్పోయారు. 

Also Read: ఇరాన్‌పై దాడులకు ‘ఉక్రెయిన్‌’ డ్రోన్లు...ఒకే అన్న జెలెన్‌స్కీ

బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) గెలిచింది.ఈ పార్టీ చీఫ్‌ తారిఖ్ రెహమాన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 2024లో విద్యార్థుల ఉద్యమంతో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం పర్యవేక్షణలోనే ఎన్నికలు జరగగా.. బీఎన్‌పీ అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా హిందువులపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. 

Advertisment
తాజా కథనాలు