ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన హమాస్.. ఇజ్రాయిల్ బందీల విడుదల

ట్రంప్, ఇజ్రాయిల్ వార్నింగ్‌కు హమాస్ శనివారం ముగ్గురు బందీలను విడుదల చేసింది. వారిని రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది. శనివారం మధ్యాహ్నంలోగా ఇజ్రాయిల్ బందీలను అప్పగించకపోతే హమాస్‌ను ఏం చేస్తానో నాకే తెలియదని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు.

New Update
hamas hostateges

hamas hostateges Photograph: (hamas hostateges)

శనివారం మధ్యాహ్నం 12 నాటికి ఇజ్రాయిల్ బందీలను హమాస్ విడుదల చేయకుంటే ఏం జరుగుతుందో నాకే తెలియదని వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. ఇజ్రాయిల్ కూడా కాల్పుల విరమణ ఒప్పందం పక్కన పెట్టి మళ్లీ హమాస్‌పై దాడికి దిగుతామని చెప్పింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌కు ఫిబ్రవరి 15 మధ్యాహ్నం నాటికే డెడ్‌లైన్ పెట్టాడు. దీంతో హమాస్ బందీలుగా ఉన్న ముగ్గురిని విడిచిపెట్టింది. ఇయర్ హార్న్(46), సాగుయ్ డెకెల్-చెన్(36), సాషా (అలెగ్జాండర్) ట్రౌఫానోవ్ (29) లను హమాస్ రెడ్‌క్రాస్‌కు అప్పగించారు. ఇందులో ఇద్దరు ఇజ్రాయిల్ వారు కాగా.. మరో వ్యక్తి అమెరికాకు చెందని వాడు. 42 రోజు కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత హమాస్ కొందమంది బందీలను విడుదల చేసి మిగిలిన వారిని వదిలిపెట్టేందుకు నిరాకరించింది.

2023 అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై దాడి చేసి హమాస్ టెర్రరిస్టులు 251 మందిని బందీలు చేశారు. ఇజ్రాయిల్, హమాస్ చేసుకున్న ఒప్పందంతో ఇజ్రాయిల్‌లో ఉన్న 2000 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తే దీనికి బదులుగా హమాస్ బందీలుగా ఉన్న 251 మంది వదిలేస్తామని సంధి చేసుకున్నారు. అందుకోసం వారు 42 రోజులపాటు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. విడదల వారీగా హమాస్ గాజాలో ఉన్న బందీలను విడుదల చేస్తోంది.

ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi Arrest Case: నా భర్తను జైల్లో చంపేస్తారు.. వల్లభనేని వంశీ భార్య సంచలన ఆరోపణలు!

251 మందిలో ఇంకా 73 మంది గాజాలోనే ఉన్నారు. వీరిలో 35 మంది ఇజ్రాయిల్ రక్షణ దళాలు చనిపోయారు. మిగిలిన వారిలో మరో ముగ్గురిని శనివారం హమాస్ విడుదల చేసింది. 369 మంది పాలస్తీనియన్ ఖైదీలకు బదులుగా బందీలను తిరిగి ఇచ్చారు. జనవరిలో హమాస్ 33 మంది ఇజ్రాయెల్ బందీలను అప్పగించడానికి అంగీకరించింది. వీరిలో మహిళలు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు, గాయపడినవారు మరియు వృద్ధులు ఉన్నారు. వీరిని వందలాది మంది పాలస్తీనియన్ ఖైదీలకు బదులుగా అప్పగించారు. ఈ సమయంలో ఇజ్రాయెల్ దళాలు గాజాలోని కొన్ని స్థానాల నుండి వెనక్కి తగ్గుతాయి.

Also Read : Tamilanadu: ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.6 లక్షలు.. అందులో ఏమంతా స్పెషల్‌ ఉందబ్బా!

Advertisment
తాజా కథనాలు